పొరుగు రాష్ఱ్టం తమిళనాడులో దివంగత సీఎం జయలలిత గతంలో ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లు ఇప్పటికీ జనాదరణ పొందుతున్నాయి. రూ.5కే పేదలకు భోజనం పెట్టే ఆ క్యాంటీన్ల పథకాన్ని చాలా రాష్ర్టాలు స్వీకరించాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ పథకాన్ని అమలు చేయాలని 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి అనుకుంటోంది కానీ, ఇంతవరకు అమల్లోకి తేలేదు. కానీ... ప్రభుత్వం చేయలేని పనిని విపక్ష నాయకులు చేయడానికి రెడీ అవుతున్నారు. హిందూపురంలో ఇప్పటికే ఒకటి ప్రారంభించగా... దాని స్ఫూర్తిగా మరిన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు వైసీపీ నేతలు కొందరు సిద్ధమవుతున్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను గుర్తు చేస్తూ అన్న క్యాంటీన్లను ప్రవేశ పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంది. కానీ... ఇంతవరకు అది పూర్తి స్తాయిలో అమలు కాలేదు. ఇంతలో ఒడిశా - రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేశాయి. తాజాగా ఏపీలోనూ ఇలాంటి క్యాంటీన్లు మొదలవుతున్నాయి. హిందూపురానికి చెందిన వైసీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరిటి రెండు క్యాంటీన్లను ప్రారంభించారు. అక్కడ రూ.9కే పేదలకు భోజనం పెడతారు.
జీవనోపాధి కోసం పట్టణానికి వస్తున్న పేదవారికి తక్కువ ధరకు భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట జనతా క్యాంటీన్లను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఈ క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకు అంటే రూ. 9కే కడుపు నిండా ఆహారం అందిస్తున్నట్లు నవీన్ నిశ్చల్ చెప్పారు. కాగా ప్రభుత్వం చేయలేకపోయిన పనిని చేపట్టిన వైసీపీ నేతను ఆ పార్టీకి చెందిన పలువురు ఇతర నేతలు అభినందిస్తున్నారు. తాము కూడా అలాంటి క్యాంటీన్లను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు.