వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖలో జరిగిన హత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ పై దాడి జరగడానన్ని పలువురు నేతలు ఖండించారు. తెలంగాణలో కేటీఆర్ - తలసాని సహా పలువురు జగన్ కు సంఘీభావంగా పరామర్శించారు. అయితే, ఈ ఘటనను ముందు నుంచి టీడీపీ నేతలు రాజకీయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ ఘటనను చిన్నది చేసి చూపుతూ...వైసీపీపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. జగన్ ఘటన చిన్నదని....గాయం కూడా చిన్నదని...నేడు ఢిల్లీలో జాతీయ మీడియాకు కూడా చంద్రబాబు చెప్పడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేతలతీరుపై వైఎస్సార్ సీసీ నేత కొలుసు పార్థసారథి మండిపడ్డారు.
నేర ప్రవృత్తి కలిగిన టీడీపీ నేతలు క్రూర మృగాల్లా మాట్లాడుతున్నారంటూ ఆయన నిప్పులు చెరిగారు. టీడీపీ నేతల మాటల తీరులో కసి - ఓర్వలేనితనం స్పష్టంగా కన్పిస్తున్నాయన్నారు. గాయపడ్డ ప్రతిపక్ష నేతను పరామర్శించే కనీస హుందాతనం లేని సీఎం చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఆయన పరామర్శించకపోగా....జగన్ ను పరామర్శిస్తోన్న ఇతర పార్టీల నేతలపై బాబు ఓర్వలేనితనం ప్రదర్శిస్తున్నారన్నారు. అబద్ధపు హామీల నుంచి బయట పడేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు బాబు కుట్రపన్నుతున్నారన్నారు. ఆపరేషన్ గరుడ నిజమేనేమోనని బాబు అంటున్నారని, అయితే, దానికి వ్యూహ రచన చేసింది చంద్రబాబేనన్న అనుమానం తమకు కలుగుతోందన్నారు. ఆపరేషన్ గరుడ ప్రకారం ముఖ్యనేత పై దాడిని బాబు సర్కార్ ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు.