తొంద‌ర‌ప‌డ్డాం.. వైసీపీ నేత‌లు ప్ర‌జ‌ల‌కు ఇలానే చెబుతార‌ట‌!

Update: 2022-09-18 02:30 GMT
''ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు అనేక హామీలు ఇస్తాం.. అవ‌న్నీ సాధ్య‌మా.. కాదా.. అనేది అధికారం లోకి వ‌చ్చాక తెలుస్తుంది'' ఇదీ.. కొన్నాళ్ల కింద‌ట క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బొమ్మై చేసిన వ్యాఖ్య‌లు. అప్ప ట్లో ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ఏపీలోనూ వ‌చ్చేలా క‌నిపిస్తోంది. కీల‌క‌మైన అంశాల్లో స‌ర్కారు.. మ‌డ‌మ తిప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ విషయాల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీలు.. బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

దీంతో వైసీపీ నాయ‌కులు.. ''తెలివిలేదు.. తెలియ‌లేదు.. తొంద‌ర‌ప‌డ్డాం..'' అని ప్ర‌జ‌ల‌కు చెప్పేందుకు రెడీ అయ్యార‌ట‌. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. రెండు కీల‌క విష‌యాల్లో వైసీపీ స‌ర్కారు అడ్డంగా దొరికిపో యింద‌నే టాక్ వినిపిస్తోంది. ఒక‌టి.. ఉద్యోగ వ‌ర్గాల‌కు.. సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తాన‌ని ఇచ్చిన హామీ. దీనికి ఎన్నిక‌ల‌కు ముందు.. భారీగానే ప్ర‌చారం క‌ల్పించారు అధికారంలోకి రాగానే.. వారంలోనే సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తామ‌న్నారు.  అయితే.. మూడేళ్లు దాటిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

దీనిపైనే ఉద్యోగులు ఉద్య‌మం చేస్తున్నారు. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం.. తాము చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేస్తోంది. అంతేకాదు.. ఇప్ప‌టికే స‌జ్జ‌ల ఒక‌టికి రెండు సార్లు.. తెలియ‌క హామీ ఇచ్చాం.. అంటూ.. చెప్పుకొచ్చారు.

ఇక‌, మ‌రో కీల‌క హామీ.. మ‌ద్య నిషేధం. విడ‌త‌ల వారీగా.. దీనిని అరిక‌డ‌తామ‌ని.. పేదింటి అక్క‌చెల్లెమ్మ‌ల తాళిబొట్ల‌కు తాము ర‌క్ష‌ణ‌గా ఉంటామ‌ని.. వైసీపీ నేత‌లు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌చారం చేశారు. అయితే.. ఈ విష‌యంలోనూ.. యూట‌ర్న్ తీసుకున్నారు.

దీంతో మద్య నిషేధాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారనే విష‌యంపై .. ప్రజల భౌతిక ప్రమాణాలను మెరుగుపరిచే దృష్టితో రాష్ట్రంలో ఆల్కహాల్‌ వినియోగ స్థాయులను తగ్గించాలనే స్పష్టమైన విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే  స‌మాధానం వ‌స్తోంది. నిషేధం ఎప్పటిలోగా చేస్తారని అడిగితే ఫలానా నెల లేదా సంవత్సరం అని సమాధానం ఇవ్వాలి. అదికాకుండా కేవలం వినియోగాన్ని తగ్గిస్తామని మాత్రమే చెప్పింది. అంటే మద్య నిషేధం అనే మాటే లేదని స్ప‌ష్టం అయిపోయింది.  

సో.. ఈ రెండు అంశాల‌పైనే వ‌చ్చే ఎన్నిక‌ల్లోప్ర‌త్య‌ర్థి పార్టీలు.. వైసీపీని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీంతో ఆయా అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న‌ది వివ‌రించాలని వైసీపీ ఇప్ప‌టికే నిర్ణ‌యించేసుకుంద‌ని తెలుస్తోంది.  వాస్త‌వానికి సంపూర్ణ మద్య నిషేధంపై ఇప్పటి వరకూ ప్రజలకు ఏ మూలనో ఉన్న చిన్న ఆశ కూడా ఇప్పుడు క‌రిగిపోయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News