ఏపీలో వైసీపీ అధినేతే జగన్ పాదయాత్ర ఆ పార్టీ నాయకులను ఇప్పుడు తెల్లారి అయిదో గంటకే నిద్ర లేపేస్తోంది. అవును - సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని మరీ నాయకులు నిద్ర లేస్తున్నారు. లేవడంతో సరిపెడుతున్నారా..? వెంటనే పార్కుల వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడకు వెళ్లి రెండు మూడు గంటలు మార్నింగ్ వాక్ చేస్తున్నారు.
రెండు రోజుల కిందట తమ అధినేత కడప జిల్లా ఇడుపుల పాయలో పాదయాత్ర ప్రారంభించడంతో మిగతా జిల్లాల నేతలూ అలర్టయ్యారు. పాదయాత్ర తమ జిల్లాలకు వచ్చినప్పుడు కచ్చితంగా జగన్ ను ఫాలో కావాలి కాబట్టి నడవడం నేర్చుకుంటున్నారు. సాధారణంగా చాలామంది నేతలు ఇంట్లోంచి అడుగు తీస్తే వాహనాల్లోనే తిరుగుతారు. దీంతో నడక వారికి కష్టం. పైగా బిజీ ప్రజా జీవితం - వ్యాపారాలు - వ్యవహారాల కారణంగానూ చాలామందికి టైముండదు. కాబట్టి నడక వంటివి వారికి కష్టం. కానీ.. ఇప్పుడు సాక్షాత్తు పార్టీ అధినేతే ఆర్నెళ్ల పాటు పాదయాత్ర చేస్తుంటే ఎమ్మెల్యేలుగా - సీనియర్ లీడర్లుగా ఉన్నవారు... వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్నవారు కనీసం తమ జిల్లాకు పాదయాత్ర వచ్చినప్పుడైనా అధినేత వెంట వెళ్లకపోతే జనం హర్షించరు. కాబట్టి తామూ నడవాల్సిందే. అప్పటికప్పుడు రంగంలోకి దిగితే మోకాళ్ల నొప్పులు తప్ప అర కిలోమీటర్ కూడా నడవలేరు. దీంతో వారంతా ముందుగానే జాగ్రత్త పడుతూ రోజూ మార్నింగ్ వాక్ కు వెళ్తున్నారట. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే తమ ప్రాంతానికి పాదయాత్ర వచ్చినప్పుడు సులభమవుతుందని వారి భావన.
పాదయాత్ర ప్రారంభమైన కడప చుట్టుపట్ల జిల్లాలవారు ఇప్పటికే నడక ప్రాక్టీస్ ముమ్మరం చేయగా.. పాదయాత్ర తమ జిల్లాలకు రావడానికి ఇంకా చాలా టైం ఉన్న ఉత్తరాంధ్ర నేతలు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తున్నారట. అయితే... పొద్దున్నే అయిదు గంటలకు లేచి తమ భర్తలు మార్నింగ్ వాక్ కు వెళ్తుండడంతో నేతల భార్యలు సంతోషిస్తున్నారు. జగన్ పాదయాత్ర పుణ్యమా అని తమ భర్తల ఆరోగ్యం బాగుపడుతోందని... నడక వల్ల కొలెస్ర్టాల్ వంటివి తగ్గి ఆరోగ్యంగా ఉండే అవకాశం వచ్చిందంటూ వారు తమ మంగళసూత్రాలను కళ్లకు అద్దుకుంటున్నారట.