ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగన తీరుపై వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు మేలు జరుగుతుందని అందరు ఆశించారని తెలిపారు. అయితే సమావేశాల నిర్వాహణ తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను సభలో ప్రతిపక్షం లేవనెత్తితే ప్రభుత్వం చర్చకు ముందుకు రాకుండా తప్పించుకుందని విమర్శించారు. తాము సభ నిర్వహించామని చెప్పుకోవడం కోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేశారే తప్పించి ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు కాదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కు మైక్ ఇచ్చిన నిమిషంలోనే కట్ చేసి టీడీపీ నేతలకు అవకాశం కల్పిస్తున్నారని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. అధికార పక్షం సభ్యులు వ్యక్తిగత దూషణకు దిగి సభా సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. దాదాపు 42 అంశాలపై సమావేశాల్లో చర్చించాలని తాము బీఏసీలో కోరినట్లు చెప్పారు. అయితే అందులో మెజార్టీ అంశాలు చర్చకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, చాలా ప్రాంతాల్లో పంటలు చేతికందడం లేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు లేవని శ్రీనివాసులు విమర్శించారు. కాంట్రాక్టర్లు, టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పట్టిసీమ పేరుతో రూ.1600 కోట్లు కాజేశారని ఆరోపించారు. త్వరలోనే మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలని కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
మరో ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం వాస్తవాలు మాట్లాడితే ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితుల్లో లేదని దుయ్యబట్టారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడి విచ్చల విడిగా ఫ్యాక్టరీలకు పర్మీషన్లు ఇవ్వడం వల్లే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్తూరు ఆక్వాఫుడ్‌లో 5 మంది కార్మికుల మరణానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని జగ్గి రెడ్డి డిమాండ్ చేశారు. తుందుర్రు ఫ్యాక్టరీకి పైపులైన్ వేస్తామని గత రివ్యూ మీటింగ్‌లో చంద్రబాబు ప్రకటించారని అయితే ఇప్పటి వరకు ఒక్క అడుగైనా పైపులైన్ పడిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి ఆయా కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అవుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఇలాంటి కంపెనీలకు పర్మీషన్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పుష్కరాల్లో 29 మంది చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి బలైతే ఇప్పటి వరకు చార్జ్‌షీట్ కూడా ఫైల్ చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని జగ్గిరెడ్డి అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/