ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం ఘటనపై ఇపుడు దేశవ్యాప్తంగా చర్చజరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ పై దాడిని పలువురు నేతలు ఖండించగా....టీడీపీ నేతలు మాత్రం జగన్ పైనే ప్రతివిమర్శలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. రోజురోజుకీ దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తూ....తమ విలువను పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై దాడి విషయంలో చంద్రబాబు స్పందనపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. జగన్ పై దాడి విషయంలో బాబు స్పందన దురదృష్టకరమన్నారు. బాబుపై అలిపిరిలో దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ధర్నా చేసి సంఘీభావం తెలిపారని ఆయన గుర్తుచేశారు. జగన్ పై దాడి ఘటనకు సంబంధించి సీబీఐ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో విచారణ చేయాలన్నారు. ``చంద్రబాబుపై అలిపిరిలో దాడి మావోయిస్టులు చేసింది కాదు.. భువనేశ్వరి చేయించారని ఎవరైనా అంటే ఒప్పకుంటారా? అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు``అని విజయసాయి రెడ్డి అన్నారు.
జగన్ పై కత్తిపోటు చిన్నదేనన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఈ హత్యకు కుట్ర పన్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపణలపై మిథున్ నిప్పులు చెరిగారు. ``ఓ తల్లి - ఓ చెల్లి మీద అనుమానం వచ్చినవాడు మనిషే కాదు. జగన్ పై దాడి చిన్నదని చెప్పిన టీడీపీ నేతలను నా దగ్గరకు తీసుకురండి. నేను వాళ్లను మెడపై కొద్దిగా పొడుస్తా. అదే కత్తితో మెడపై పొడిస్తే డైరెక్టుగా పైకి వెళ్లిపోతారు’` అని ఆయన మండిపడ్డారు. జగన్ పై దాడి గురించి టీడీపీ నేతల వ్యాఖ్యలు దిగజారిపోతున్నాయని మిథున్ మండిపడ్డారు. ఎయిర్ పోర్టులో జరిగినందును ఆ దాడి కేంద్రం పరిధిలోదని - చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారని, కాబట్టి సీబీఐ లేదా కేంద్రం సంస్థతో దర్యాప్తు జరిపించాలని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరినట్లు తెలిపారు.
జగన్ పై దాడి వ్యవహారంలో టీడీపీ నేతల నీచమైన వ్యాఖ్యలు నానాటికీ మరింత దిగజారిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కేవలం అధికారం కోసమే టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా జగన్ పై ఈ తరహా తుఛ్చ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆపరేషన్ గరుడ అంటూ...ఆ దాడి వ్యవహారాన్ని బీజేపీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని బట్టి అధికారం కోసం టీడీపీ నేతలు...ఎవరిపై అయినా బురదజల్లేందుకు సిద్ధంగా ఉంటారన్నది స్పష్టమైంది. జగన్ పై దాడి నేపథ్యంలో టీడీపీ నేతల స్థాయి ఏమిటనేది ఏపీ ప్రజలకు అర్థమైంది. ఆఖరికి విజయమ్మ - షర్మిల పేర్లను కూడా ఈ వ్యవహారంలోకి తేవడంతో ప్రజలు ...టీడీపీ నేతల జుగుప్సాకరమైన వ్యాఖ్యలను అసహ్యించుకుంటున్నారు. రాజకీయాలలో విమర్శలు సహజమని...కానీ, ఈ తరహాలో అధికారదాహంతో నీచమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.