కోప‌గించార‌ని రాస్తారా? కేసులు వేస్తామంటున్నారు

Update: 2017-07-06 05:55 GMT
ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌త్యాల‌తో.. అబ‌ద్ధాలతో  త‌మను.. త‌మ పార్టీని.. అధినేత జ‌గ‌న్ ఇమేజ్‌ను దెబ్బ తీస్తున్న వైనంపై వారు మండిప‌డుతున్నారు. ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ ప‌రిచ‌య కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ .. త‌న పార్టీకి చెందిన కొంద‌రు ద‌ళిత‌.. గిరిజ‌న  ఎమ్మెల్యేల‌పై తీవ్రంగా మండిప‌డిన‌ట్లుగా ఒక మీడియా సంస్థ‌లో వ‌చ్చిన‌వార్త‌ల్ని వారు ఖండిస్తున్నారు. ద‌ళితుడైన రామ్‌ నాథ్‌ కు జ‌గ‌న్ పాదాభివంద‌నం చేయ‌టం కూడా స‌ద‌రు మీడియా సంస్థ స‌హించ‌లేక‌పోతోంద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

త‌మ అధినేత రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని పాదాభివందం చేయ‌టాన్ని స‌హించ‌లేద‌ని..అందుకే విషం క‌క్కింద‌ని మండిప‌డుతున్న జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేలు.. త‌న తీరు ప‌ట్ల‌.. త‌న రాత‌ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటున్నారు. లేని ప‌క్షంలో స‌ద‌రు మీడియా సంస్థ‌పై ఎస్సీ..ఎస్టీ కేసులు వేస్తామంటూ హెచ్చ‌రిస్తున్నారు. అన్యాయంగా అబ‌ద్ధాలు రాస్తున్నార‌ని.. త‌మ అధినేత త‌మ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌కున్నా..  కోప‌గించారంటూ వార్త‌లు రాయ‌టం స‌రికాదంటున్నారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి కోవింద్‌కు త‌మ‌ను పేరు పేరునా ప‌రిచ‌యం చేసిన‌ట్లుగా జ‌గ‌న్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వ‌రి (పాడేరు).. క‌ళావ‌తి (పాల‌కొండ‌).. పుష్ప శ్రీవాణి  (కురుపాం) మండిప‌డుతున్నారు.


Tags:    

Similar News