ఎప్పుడూ లేనిది తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెగ ఫీలైపోతున్నారు. పార్టీ సుప్రీమ్ సైతం పట్టించుకోని విషయాన్ని పిల్లకాయల్లాంటి పార్టీ నేతలకు పట్టటం కాస్తంత కొత్తగా అనిపించే అంశం. పేరుకు తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కానీ.. తెలంగాణ అధికారపక్షానికి తోక పార్టీగా వ్యవహరిస్తున్న సంగతి బహిరంగ రహస్యం. పార్టీ ప్రయోజనాల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న జగన్ తీరుకు తగ్గట్లే పార్టీ తెలంగాణ చీఫ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నేతలు తాజాగా ప్రశ్నించటం కలకలంగా మారింది.
పార్టీ నుంచి త్వరలో జంప్ కావటం ఖాయమన్న వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేరుకు పార్టీనే కానీ.. ఎలాంటి కార్యకలాపాలు లేనప్పటికీ.. పార్టీ నేతలు మాత్రం పొంగులేటి తీరు మీద ఫీలైపోవటం గమనార్హం. పార్టీ ఫిరాయింపుల మీద సమావేశంలో ఘాటుగా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. పార్టీ మారుతున్నారన్న వార్తల మీద పొంగులేటి మీద ఫైర్ అయిన తీరుపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు.
అధినేతే.. తెలంగాణ అధికారపక్షం పట్ల కించిత్ విమర్శలు చేయకుండా ఉండటాన్ని ప్రశ్నిస్తూ.. ఇలాంటి పార్టీ ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? అన్న ప్రశ్నను వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఫిరాయింపుదారు అయితే తల కొట్టేసినట్లు ఉండదా? అన్న ప్రశ్నలు వేస్తున్న తీరుపై పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
తాను కానీ టీఆర్ ఎస్ లో చేరి ఉంటే ఈ పాటికి మంత్రిని అయ్యే వాడినని.. పార్టీ మారాలనుకుంటే అందరికి ధైర్యంగా చెప్పే వెళతానే కానీ కామ్ గా వెళ్లిపోనంటూ ఫైర్ అయినట్లు చెబుతున్నారు. అధికారపక్షానికి అనుబంధం అన్నట్లుగా ఉంటున్న నేపథ్యంలో పొంగులేని పార్టీ మారాల్సిన అవసరమే లేదన్న మాటను కొందరు చెబుతుంటే.. ఒకవేళ పార్టీ మారినా పెద్ద తేడా ఏమీ లేదన్న ఆగ్రహాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఇలాంటి మాటలు తాము నమ్ముకున్న అధినేత మనసును కష్టపెడతాయన్న విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆలోచించట్లేదు..?