కోడెల ముందుకు ఫిరాయింపుల కేసు

Update: 2016-02-23 10:50 GMT
వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పడు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వద్దకు చేరింది. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి రాజీనామాలు చేయకుండా టీడీపీలో చేరిన నేతలపై అనర్హత వేటువేయాలని వైసీపీ నేతలు స్పీకర్ ను కోరారు. వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ - ఆళ్ల రామకృష్ణారెడ్డి - పిన్నెల్లి లక్ష్మారెడ్డి తదితరులు కోడెలను కలిసి ఈ మేరకు విజ్ఙప్తి చేశారు. చంద్రబాబు రాజకీయాల్లో నీచ సంస్కృతికి తెరలేపారని ఆరోపించిన వారు ప్రస్తుతం ఫిరాయించినవారంతా రాజీనామాలు చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు.
   
తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఏపీలోనూ ఆ పరిస్థితి వస్తుందేమోనన్న భయంతో ముందుజాగ్రత్తగా తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టి తీసుకెళ్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు.
   
కాగా ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారాలు, వారిపై చర్య తీసుకునే అధికారాలు స్పీకర్ పరిధిలోనే ఉంటాయి. అయితే... తెలంగాణలో మాదిరే స్పీకర్ తన అధికారాలను వాడకుండా ఈ విషయాల్లో చూసీ చూడకుండా వ్యవహరించే అవకాశాలే ఎక్కువ. స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించాల్సి ఉన్నా అధికార పార్టీ వ్యక్తులు కావడం... ప్రభుత్వ ఒత్తిడి వల్ల స్వీయ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. దీంతో ఫిరాయింపులపై ప్రతిపక్షం ఎంత అరిచిగీపెట్టినా ప్రయోజనం ఉండదని అంటున్నారు. కోడెల కూడా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి మాదిరిగానే వ్యవహరిస్తారు తప్ప అంతకుమించి ఆశించలేమన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News