వైఎస్సార్సీపీ రాజ‌కీయ నిరుద్యోగుల ప‌రిస్థితి ఏంటి?

Update: 2020-01-24 14:30 GMT
మండ‌లి ర‌ద్దు ఊహాగానాలు అత్యంత ఆస‌క్తిదాయ‌కంగా మారాయి. గ‌త నెల రోజులుగా ఏపీలో వాడీవేడీగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప‌తాక స్థాయికి చేర్చాయి మండ‌లి ర‌ద్దు ఊహాగానాలు. మండ‌లి ర‌ద్దు ఊహాగానాల‌కు ఊతం ఇచ్చారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అయితే ఇంతవ‌ర‌కూ అలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. మండ‌లిర‌ద్దు తీర్మానాన్నిప్ర‌వేశ పెట్ట‌బోతున్న‌ట్టుగా కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌లేదు. బ‌హుశా సోమ‌వారం స‌భ‌లో ఈ అంశం మీద పూర్తి క్లారిటీ రావొచ్చు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. మండ‌లి గ‌నుక ర‌ద్దు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ చాలా మంది నిరాశ చెందాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే మండ‌లిలో వైసీపీకి 9 మంది స‌భ్యులున్నారు. మండ‌లి ర‌ద్దు అయితే వీరందరి హోదాలూ పోతాయి!

వీరిలో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్లున్నారు. ఆల్రెడీ స‌భ్యులు అయిన వారి సంగ‌త‌లా ఉంటే.. ఇంకా అనేక మంది నేత‌లు మండ‌లి మీద ఆశ‌లుపెట్టుకుని ఉన్నారు. మండ‌లిలో వైసీపీ ముందు ముందు మ‌రింత‌గా బ‌ల‌ప‌డే అవ‌కాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎక్క‌డా అంత బ‌లం లేదు.

మండ‌లిలో నామినేటెడ్ ప‌ద‌వులూ, అలాగే వివిధ జిల్లాల స్థానిక సంస్థ‌ల కోటాతో భ‌ర్తీ అయ్యే ప‌ద‌వులు.. ఇవ‌న్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ప‌డే అవ‌కాశాలే ఉన్నాయి. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. రానున్న‌
 రోజుల్లో మాత్రం.. మండ‌లి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌రం అవుతుంది. రెండు మూడేళ్ల‌లో అలా మండ‌లిని పూర్తిగా వైసీపీ హ‌స్త‌గ‌తం చేసుకునే అవ‌కాశాలున్నాయి.

ఆ ప‌ద‌వుల మీద అనేక మంది స‌హ‌జంగానే ఆశ‌లు పెట్టుకుని క‌నిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మండ‌లి గ‌నుక ర‌ద్దు అయితే.. అలాంటి వారందిరికీ నిరాశ త‌ప్ప‌దు. భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల్లో కూడా మండ‌లి ప‌ద‌వులు కీల‌క పాత్ర‌ను పోషించే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇలాంటి నేప‌థ్యంలో.. మండ‌లి ర‌ద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌నూ కొంత వ‌ర‌కూ నిరాశ ప‌రిచే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఈ వ్య‌వ‌హారంలో మ‌రేం జ‌రుగుతుందో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News