అమరావతిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ గురించి చంద్రబాబు ఎన్నో గొప్పలు చెప్పారు. మైకులు విరగ్గొట్టడం ఇక కుదరదన్నారు. స్పీకర్ పోడియం వద్దకు ఎవరూ వెళ్లలేరని.. స్పీకర్ హ్యాపీగా ఉండొచ్చని చెప్పారు. కానీ.. ఆయన కలలను భగ్నం చేసేశారు ప్రతిపక్ష వైసీపీ సభ్యులు. సమావేశాలు ఇంకొక్క రోజులో ముగుస్తాయనగా సంచలనం సృష్టించారు. ఆరడుగుల ఎత్తున్న స్పీకర్ పోడియంపైకి ఎగిరి దుమికారు. దీంతో స్పీకర్ షాక్ తిన్నారు. టీడీపీ సభ్యులైతే నోరెళ్లబెట్టేశారు.
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో వెంటనే చర్చించేందుకు అనుమతించాలని కోరుతూ నినాదాలతో మొదలు పెట్టిన వైకాపా ఎమ్మెల్యేలు ఎంతగా ఆందోళన చేస్తున్నా స్పీకర్ నుంచి స్పందన లేకపోవడంతో వారు ఆ నిర్లక్ష్యాన్ని సహించలేకపోయారు. సుమారు ఆరు అడుగుల ఎత్తులో ఉన్న స్పీకర్ పోడియంను ఎక్కేశారు. ఇన్ని రోజులూ నిత్యమూ పోడియం కింద నిలబడి మాత్రమే నిరసనలు చెబుతున్న వైకాపా.. ఈ రోజు మాత్రం.. పోడియంపైకి ఎక్కారు.
తొలుత స్పీకర్ చైర్ ను సమీపించి ఇరువైపులా నిలబడి నినాదాలు చేశారు. "నారా వారి బినామీ నారాయణ", "ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం", "విద్యార్థులకు న్యాయం చేయాలి" అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే స్పీకర్ చర్చకు అనుమతించకపోవడంతో స్పీకర్ పోడియం పైకి ఎక్కి ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ శాసనసభను మరోసారి వాయిదా వేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/