ఏం చేసినా చేయకున్నా.. ఇప్పుడు జగన్ బ్యాచ్ అర్జెంటుగా చేయాల్సిన పని ఒకటి ఉంది. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేతలు.. నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరవుతున్నారు. ఇప్పటివరకూ ఇది బాగానే ఉన్నా.. ఇక మాత్రం నల్లబ్యాడ్జీలు పెట్టుకుంటే తప్పు కావటం ఖాయం.
ఎందుకంటే.. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన స్టేను తాజాగా ద్విసభ్య ధర్మాసనం కొట్టేసిన నేపథ్యంలో జగన్ బ్యాచ్ ధరించిన నల్ల బ్యాడ్జిలను వెనువెంటనే తొలగించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా వారు నిరసన తెలిపేందుకు చేసిన పని.. తాజాగా వెలువడిన తీర్పు నేపథ్యంలో.. ఇంకా నిరసన కొనసాగిస్తే.. కోర్టు తీర్పుపై నిరసన వ్యక్తం చేసినట్లుగా మారుతుంది. ఇది లేనిపోని తలనొప్పులకు కారణమవుతుందనటంలో సందేహం లేదు. మరి.. జగన్ బ్యాచ్ నల్ల బ్యాడ్జిలను తీసేస్తారా?