వైసీపీ నెక్ట్స్ టార్గెట్ బాలయ్యేనా?

Update: 2016-03-07 10:41 GMT
 ఏపీ రాజధాని అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారాలపై తమ పత్రికలో కథనాలు రాయించి టీడీపీ మంత్రులను, చంద్రబాబును కలవరానికి గురిచేసిన వైసీపీ ఇప్పుడు మరో అడుగు ముందుకేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు మంత్రులను టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు చంద్రబాబు వియ్యంకుడు కం బావమరిది, యువనేత లోకేశ్ కు స్వయానా మామ అయిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను టార్గెట్ చేయనున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి.

నిజానికి రెండు రోజుల కిందట ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను వైసీపీ పత్రిక బాగా రచ్చ చేస్తుందని అంతా భావించినా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్లుగానే తేల్చేసింది. అయితే.... బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గమున్న అనంతపురం జిల్లాలో మాత్రం బాలయ్య బరితెగించాడంటూ భారీ చెప్పాల్సిందింతా చెప్పేసింది. బాలయ్య లేపాక్షి ఉత్సవాల్లో సంప్రదాయం - ఆచారాలు అంటూ కథలు చెప్పారని.... సినిమా ఫంక్షన్ లో మాత్రం బూతు వేషాలు వేశారంటూ ఏకిపడేశారు. మహిళా సంఘాలు బాలయ్యపై మండిపడుతున్నాయని కూడా రాసుకొచ్చారు. చూడబోతే బాలయ్యను ఆయన నియోజకవర్గంలోనే దెబ్బతియ్యడానికి పథకం రూపొందుతున్నట్లుగా ఉందని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఇక బాలయ్యపై ఓ కన్నేసి ఉంచి ఆయన ఎక్కడ దొరికినా అన్ పాపులర్ చేసి చంద్రబాబును ఇరుకునపెట్టాలని  వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News