వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ప్రమేయం లేకుండా జరిగే ప్రోగ్రామ్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పటికీ ఆ పార్టీ జగన్ మీదే పూర్తి ఆధారపడి ఉంటుంది. జగన్ ను చూసే ఓటేస్తారు.. తామను చూసి కాదన్నట్టుగా చాలా మందినేతలు వ్యవహరిస్తూ ఉంటారు. అన్నీ జగనే చేస్తాడు.. తాము ఏమీ చేయనక్కర్లేదు అన్నట్టుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తూ ఉంటారు.
ఇలాంటి పార్టీలో జగన్ లేకుండా అప్పుడప్పుడు జరుగుతున్న కార్యక్రమం వంచనపై గర్జన. వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని ఇది వరకూ ఏపీలో పలు చోట్ల నిర్వహించారు. తాజాగా నిన్న ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. వైసీపీ ముఖ్య నేతలు - కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమానికి జన సమీకరణ చేయడం గట్రా కుదిరే పని కాదు. అందులోనూ జగన్ లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇలా పెద్దగా పస లేకుండా సాగింది ఈ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యన క్రెడిట్ కోసం పోటీ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన వైసీపీ నేతలు ఎవరికి వారు తమ వల్లనే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందనే ప్రచారాన్ని చేసుకొంటూ ఉన్నారు.
ఎవరికి వారు ఓన్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. తామే హైలెట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్లలో ఒకరంటే మరొకరికి పడదు. దీంతో ఎవరికి వారు హైలెట్ అయ్యే ప్రయత్నాలు మరింత తీవ్రంగా చేసుకుంటున్నారు. ఢిల్లీలో ప్రోగ్రామ్ క్రెడిట్ తమదంటే తమదన్నట్టుగా పోటీ పడుతున్నారు.జగన్ లేకుండా కార్యక్రమం నిర్వహిచండమే వైసీపీలో గగనం. ఇలాంటి నేపథ్యంలో ఒక ప్రోగ్రామ్ నిర్వహించే సరికి వైసీపీలో నేతలు క్రెడిట్ కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు!