ఆళ్ల రామకృష్ణారెడ్డి... గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యేగానే కాదండోయ్... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ ను ఓడించిన వైసీపీ నేతగానూ ఇప్పుడు వెరీ వెరీ స్పెషల్. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మంగళగిరి పోటీనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు నారా లోకేశ్ పై ఆళ్ల విజయం సాధిస్తారా? లేదంటే ఓడిపోతారా? అనే చర్చే కారణంగా చెప్పాలి. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించినట్టుగానే నారా లోకేశ్ ను ఆళ్ల మట్టి కరిపించేశారు. ఇప్పుడు కొత్తగా కొలువుదీరే జగన్ కేబినెట్ లో ఆళ్ల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇప్పటికే రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల... ఇక మంత్రిగానూ మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? మరొకరైతే... ఆకాశంలో తేలియాడేవారు. అందుకు ఆళ్ల సిద్ధపడలేదు. ఎన్నికలు ముగియగానే ట్రాక్టర్ వేసుకుని తన పొలంలో ప్రత్యక్షమైన ఆయన స్వయంగా తన పొలాన్ని దుక్కిదున్ని... అక్కడే తనతో పని చేస్తున్న కూలీలతో కలిసి భోజనం చేశారు. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఆ తర్వాత నిన్నటికి నిన్న తన నియోజకవర్గ పరిధిలో ఓ చోట గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేస్తే... తాపీ పట్టుకుని అక్కడ ప్రత్యక్షమైన ఆళ్ల... స్వయంగా గాంధీ విగ్రహానికి మరమ్మతులు చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఇక తాజాగా రైల్లో అది కూడా జనరల్ బోగీలో సాధారణ ప్రయాణికుడిగా హైదరాబాద్ నుంచి మంగళగిరి జర్నీ చేసి తనది ఎప్పటికైనా సాధారణ జీవన శైలేనని నిరూపించుకున్నారు. ఇలా రైల్లో జనరల్ బోగీలో కూర్చుని ప్రయాణం చేసిన ఆళ్ల ఫొటోలు నెట్టింట్లోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. ఎంత ఎదిగినా... ఒదిగి ఉండటమే తనకు తెలిసిన పని అని నిరూపించుకుంటున్న ఆళ్ల జీవన శైలి నిజంగానే ప్రత్యేకమని చెప్పక తప్పదు. ఇక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా కూడా ఆళ్ల స్టైల్ ఇదేనని చెప్పక తప్పదేమో.