మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి నామినేషన్ దాఖలు ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. అత్యంత భారీ ఎత్తున జనసందోహం కనిపించింది ఆళ్ల నామినేషన్ ర్యాలీలో. భారీగా జనాలు తరలి రావడంతో ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా ఉత్సాహ భరితంగా మారారు. వారిని ఉర్రూతలూగించేలా ఫ్యాన్ సింబల్ ను సైగ చేస్తూ ఉత్సాహ పరిచారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బరిలోకి దిగుతున్న నియోజకవర్గం కావడంతో మంగళగిరిపై అందరి దృష్టీ నెలకొని ఉందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమం వీడియోను చూస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. ఆ నామినేషన్ ర్యాలీని బట్టి.. తమ పార్టీ అభ్యర్థి ఖాయంగా విజయం సాధిస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా చెబుతున్నాయి. తటస్థులు కూడా.. లోకేష్ కు అంత ఈజీ కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేలా ఉంది ఆళ్ల నామినేషన్ ర్యాలీ.
ఇక తాజాగా ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాండ్రు కమల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆళ్లతో పాటు ఆమె కూడా ర్యాలీలో పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు.
ఇక ఈ సందర్భంగా ఆళ్ల మాట్లాడుతూ.. లోకేష్ పిజ్జా బర్గర్ల బ్యాచ్ అన్నారు. లోకేష్ కు కాడి తెలుసా? మేడి తెలుసా? అని ఆళ్ల ప్రశ్నించారు. లోకేష్ తలనొప్పిని వదిలించుకునేందుకే చంద్రబాబు నాయుడు ఆయనను మంగళగిరికి పంపించారని.. ఆయనకు ఓటమి ఖాయమని ఆళ్ల వ్యాఖ్యానించారు. మొత్తానికి మంగళగిరి రాజకీయ పరిణామాలు రసవత్తరంగా సాగుతున్నాయి!