సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన వెలువడడంతో రాజకీయ పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. తాజాగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈరోజు ఉదయం తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. మూడు విడతల్లో జాబితాలను విడుదల చేసేందుకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఈసారి వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ అని సర్వేలన్నీ హోరెత్తుతున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి చేరేందుకు సినీ- రాజకీయ- పారిశ్రామిక ప్రముఖులు క్యూలు కడుతున్నారు. ఈరోజు జగన్ సమక్షంలో చాలా మంది చేరేందుకు నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే ఈరోజు ఉదయం విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త- సినీ నిర్మాత అయిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) వైసీపీలో చేరారు. సినీ నటుడు రాజారవీంద్ర కూడా వైసీపీలో చేరారు. వారు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఫోటోలు- వీడియోలు మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఇక టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం వైసీపీలో ఈరోజు అధికారికంగా చేరనున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన నెల్లూరు ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నర్సింహం తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరారు.. నర్సింహం సతీమణి వైసీపీ నుంచి పెద్దాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారని సమాచారం. ఇక సినీ ప్రముఖుడు , మాజీ ‘మా’అధ్యక్షుడు శివాజీ రాజా కూడా ఈరోజు వైసీపీలో చేరాలని నిర్ణయించారు. విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు సైతం వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
*ప్రశాంత్ కిషోర్ రాక.. జాబితా సిద్ధం
ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను ఈరోజు ఉదయం విడుదల చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారని సమాచారం. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ దాదాపు తుది దశకు వచ్చింది. పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చారు. వైసీపీ ముఖ్య నాయకులందరితో సమావేశమై.. 100 నుంచి 120మంది అభ్యర్థుల తొలిజాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. తొలి విడత కనీసం 100కు పైగానే అభ్యర్థులను ప్రకటిస్తారని వార్తలొస్తున్నాయి. వైసీపీ తొలి జాబితా విడుదల చేస్తుండడంతో ఆ పార్టీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.