ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే ల వ్యవహారం రోజుకో రకంగా ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యే తీరు ఒక్కొక్క రకంగా మారుతోంది. వీరిలోనూ ఒక ఎమ్మెల్యే తీరు.. మిగిలిన వారికి భిన్నంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం పార్టీలోను.. నియోజకవర్గంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ``మీ ఫోన్ స్టేటస్ లో నా ఫొటో పెట్టండి. నేను ప్రతి రోజూ చెక్ చేస్తా`` అంటూ.. సదరు ఎమ్మెల్యే తన అనుచరులకు హుకుం జారీ చేశారట. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ విషయం భారీ ఎత్తున వైరల్ అవుతోంది.
అంతేకాదు.. ఏదైనా పనిమీద సదరు ఎమ్మెల్యే దగ్గరకు ఎవరైనా వెళ్లినా.. వెంటనే వారిని ``నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంటే.. అందులో వాట్సాప్ ఉందా? `` అని ఆరా తీస్తున్నారట సదరు ఎమ్మెల్యే. ఒకవేళ ఉంది .. అంటే.. వెంటనే స్టేటస్ చూపించమని గద్దిస్తున్నారట. దీంతో వారు వాట్సప్ స్టేటస్ చూపించ గానే.. దానిలో సీఎం జగన్ ఫొటో ఉంటే.. పట్టలేని ఆగ్రహంతో వారిపై చిందులు తొక్కుతున్నారట. ``నీకు పనులు చేసేది నేనా.. లేక పోతే.. జగనా?`` అని డైరెక్ట్‌గా మొహం మీదే అడగుతున్నాడట సదరు ఎమ్మెల్యే. అంతేకాదు.. నా దగ్గర పనులు చేయించుకునే ఉద్దేశం ఉంటే.. నా ఫొటోనే పెట్టుకోండి.. అని గద్దిస్తున్నారట.
అదేసమయంలో ఒకవేళ.. జగన్ ఫొటోనే పెట్టుకుంటాను అంటే.. అభ్యంతరం లేదని.. కానీ.. పనుల కోసం నా దగ్గరకు మాత్రం రావొద్దని బల్లగుద్ది మరీ చెబుతున్నారట.. సదరు ఎమ్మెల్యే. ఈ ఉదంతంపై వైసీపీ నాయకులు తెల్లబోతున్నారు. ``అదేంటి.. వాట్సాప్ అనేది పర్సనల్. ఎవరికి నచ్చిన ఫొటోలు.. వీడియోలు వారు పెట్టుకుంటారు. ఈయనేంటి.. ఇలా గద్దిస్తున్నారు?`` అని చర్చించుకుంటున్నారు. అయినప్పటికీ.. ఎవరూ కూడా నోరు తెరిచి బయటకు చెప్పుకోలేక పోతున్నారు. కానీ, ఇదే పంథాలో ఆయన సాగితే.. మున్ముందు.. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి.. ఈయన సంగతి తేల్చాలని నిర్ణయించుకుంటున్నారు.
నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఒక్కో విధంగా ఉంది. కొందరు తమ కార్యకర్తలతొ సొంత పనులు చేయించుకుంటున్నారనే వాదన ఉంది. మరికొందరు కార్యకర్తలను.. నిఘా వర్గంగా నియమించుకుని.. తమ నియోజకవర్గానికి చెందిన ఎంపీ విషయంలో ఏం జరుగుతోందనే విషయాలను రాబట్టుకుంటున్నారు. ఇలా.. ఎవరికి వారు.. తమకు తోచిన రీతిలో.. కార్యకర్తలను వినియోగించుకుంటున్నారే తప్ప.. పార్టీకి.. ప్రభుత్వానికి ఉపయోగపడే రీతిలో మాత్రం ఎవరూ పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితి ముదిరితే.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
దీనిపై మీ వద్ద మరింత సమాచారం ఉంటే.. కామెంట్ చేయడం మరిచిపోవద్దు.