ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రకటనపై నర్సారావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి స్పందించారు.. మొదట రాజధానిని అమరావతిలోనే ఉంచితే బావుంటుందని ఆయన అన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో తాజాగా మరోసారి అమరావతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ కొందరు నా మాటలు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యాఖ్యల్లో ముందు వెనుక ఎడిట్ చేసి చూపించారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని.. 3 రాజధానుల వికేంద్రీకరణను సమర్థిస్తున్నానని వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం జగన్ తో పాటు రాజకీయాల్లోకి వచ్చానని.. ఆయన నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటుకు సంపూర్ణ అంగీకారం తెలుపుతున్నానని పేర్కొన్నారు.