వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా.. రిజ‌న్ ఇదే!

Update: 2022-10-08 08:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో వికేంద్రీక‌ర‌ణ మంత్రం బాగానే ప‌నిచేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. మూడు రాజ‌ధాను లకు జై కొడుతున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌ను రెచ్చ‌గొడుతున్న విష‌యం తెలిసిందే.

అయితే..  ఈ క్ర‌మంలో రైతులు రెచ్చిపోకుండానే న్యాయ పోరాటం చేస్తూనే..మ‌రోవైపు పాద‌యాత్ర చేస్తూ.. రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ఒకే రాజ‌ధానితో ఒన‌గూరే ప్ర‌యోజ‌నాల‌ను వెల్ల‌డిస్తున్నా రు. అయితే.. దీనిని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న వైసీపీ నేత‌లు.. రైతుల‌పై కామెంట్లు చేస్తున్నారు.

ఇక‌,ఉత్త‌రాంధ్ర‌లోకి ఎలా వ‌స్తారో చూస్తామంటూ.. రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నారు. కాళ్లు విర‌గ్గొడ‌తామ‌ని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక‌, రెండు రోజుల కింద‌ట‌.. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, క‌మ్‌ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

విశాఖ రాజ‌ధాని అయ్యేందుకు అవ‌స‌ర‌మైతే.. రాజీనామా చేస్తామ‌ని అన్నారు. ఆయ‌న చెప్పింది నిజ‌మో కాదో తెలియ‌దు. .కానీ, తాజాగా విశాఖ‌కు చెందిన చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ ఆ ప‌నిచేసేశారు.

ప్ర‌స్తుతం చోడ‌వ‌రం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. విశాఖ‌ను రాజ‌ధానిగా చేయ‌డం కోసం.. మ‌ద్ద‌తుగానే తాను రాజీనామా చేసిన‌ట్టు చెప్పారు. స్పీక‌ర్ ఫార్మాట్‌లోనే ఆయ‌న రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. త‌ర్వ లోనే.. మ‌హా ర్యాలీ నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.

విశాఖ‌ను రాజ‌ధానిగా చేయ‌డంతోనే.. ఇక్క‌డి ఉత్త‌రాంధ్ర జిల్లాలు.. అభివృద్ది చెందుతాయ‌ని అన్నారు. మొత్తంగా..  ఈ ప‌రిణామం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ప్ర‌తిప‌క్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News