గుడివాడ‌లో ఉద్రిక‌త్త‌..ఎమ్మెల్యే నాని అరెస్టు

Update: 2015-11-15 06:44 GMT
కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గుడివాడ ప‌ట్ట‌ణంలో తీవ్ర ఉద్రిక ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ప‌ట్ణణంలో వైకాపా కార్యాల‌యాన్ని ఓ అద్దె భ‌వ‌నంలో నిర్వ‌హిస్తున్నారు. భ‌వ‌న య‌జ‌మాని పార్టీ కార్యాల‌యాన్ని ఖాళీ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో చెపుతూ వ‌స్తున్నాడు. భ‌వ‌నాన్ని ఖాళీ చేయ‌డంలో వైకాపా నాయ‌కులు ఆల‌స్యం చేయ‌డంతో య‌జ‌మాని భ‌వ‌నానికి తాళం వేశాడు. ఎమ్మెల్యే నాని ఆ తాళాన్ని ప‌గ‌ల కొట్టేందుకు ప్ర‌య‌త్నించారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు నానిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఎమ్మెల్యేకు, పోలీసుల‌కు మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జ‌రిగింది.

దీంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. నానిని గుడివాడ ప‌ట్ట‌ణంలో ఉంచితే అక్క‌డ వైకాపా కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న‌లు - ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయ‌న్న ఉద్దేశంతో నానిని ముదినేప‌ల్లి పోలీస్‌ స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. మ‌ళ్లీ అక్క‌డ నుంచి కైక‌లూరు పోలీస్‌ స్టేష‌న్‌ కు తీసుకెళ్లారు. నాని అరెస్టు తెలుసుకున్న వైకాపా కార్య‌క‌ర్త‌లు - నాయ‌కులు ఒక్క‌సారిగా రోడ్ల‌మీద‌కు రావ‌డంతో గుడివాడ ప‌ట్ట‌ణంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. నాని అరెస్టు వెన‌క టీడీపీ ప్ర‌భుత్వ హ‌స్తం ఉంద‌ని..గుడివాడ‌లో నానిని ఎదుర్కోలేకే ప్ర‌భుత్వ పెద్ద‌లు నానిని అక్ర‌మంగా అరెస్టు చేయించార‌ని వైకాపా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News