తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారిన రామోజీ.. జగన్ భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి స్పందించారు. వీరిద్దరి భేటీ గురించి ఇప్పటివరకూ రెండు వర్గాలకు చెందిన మీడియాలో కానీ.. మరే వేదికలోనూ ప్రకటించింది లేదు. అలాంటిది.. పెద్దిరెడ్డి మాత్రం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఇంటికి జగన్ వెళ్లినట్లు కన్ఫర్మ్ చేశారు.
రామోజీ ఇంటికి వెళ్లి జగన్ కలవటంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. పెద్దిరెడ్డి స్పందిస్తే.. రామోజీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అంతేకాదు.. పార్టీ అధినేతగా జగన్.. పెద్దల సలహాలు తీసుకునేందుకే రామోజీరావును కలిశారంటూ వ్యాఖ్యానించారు. రామోజీని కలవటాన్ని తాము సమర్థిస్తున్నట్లు అధినేత జగన్ చర్యకు పూర్తి బాసటగా నిలిచారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రామోజీరావును పెద్దమనిషిగా అభివర్ణిస్తున్న పెద్దిరెడ్డి.. గతంలో మరి ఇదే పెద్దమనిషి గురించి చిత్రవిచిత్ర రాతలు తమ సాక్షి పత్రికలో రాయటం గురించి ఏమంటారో?
రాజగురువు అని.. రాజకోట రహస్యం అని.. పచ్చమీడియా అంటూ రకరకాల పేర్లు పెట్టేసి.. పెద్ద పెద్ద క్యారికేచర్లు వేసేసి.. దానికి చాలానే వ్యాఖ్యలు రాసేసినప్పుడు.. సదరు పెద్దమనిషి పెద్దరికం గురించి.. ఆయన వయసు గురించి ఎందుకు పట్టించుకోలేదో..?