ఆయనది రెండు దశాబ్దాలకు పైగా రాజకీయం. 2004లో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి గెలిచారు. ఆయనే పెండెం దొరబాబు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో పెఠాపురం నుంచి పోటీ చేస్తే 47 వేల ఓట్ల తేడాతో టీడీపీ చేతిలో ఓడిపోయారు. 2019 నటికి 14 వేల పైచిలులు తేడాతో అదే సీట్లో గెలిచారు. మొత్తానికి చూస్తే రెండు సార్లు పెఠాపురం నుంచి గెలిచి ఆ కోటకు నేనే దొరబాబు అంటున్నారు.
ఇక ఆయన మరోసారి పోటీ చేసి గెలవడానికి చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు. అయితే ఆయనకు ఇపుడు కాకినాడ ఎంపీ వంగా గీత రూపంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గీత సీనియర్ మోస్ట్ లీడర్. ఆమె టీడీపీలో ఉన్నపుడు ఒక తడవ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా గెలిచారు. అలాగే రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజరాజ్యం పార్టీ తరఫున పిఠాపురం నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆమె మొదట పిఠాపురం నుంచి ఎమ్మెల్యే కోసమే ట్రై చేశారు.
అయితే అధినాయకత్వం ఆమెను కాకినాడ ఎంపీగా పోటీ చేయమని కోరడంతో చివరి నిముషంలో బరిలోకి దిగినా గెలిచారు. లోక్ సభ ఎంపీ అయిపోయారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండడంతో ఇపుడు గీత తన హాట్ సీటు పిఠాపురమే అని భావిస్తున్నారు. దాంతో ఎంపీ గారు తరచూ పిఠాపురంలోనే పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు.
దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు మండిపోతోందిట. తాను ఎమ్మెల్యేగా ఉండగా మధ్యలో ఎంపీ ఎవరు అంటూ ఆయన ఫైర్ అవుతున్నారని టాక్. ఇక అధికారులతో మీటింగులు పెట్టి వారికి ఆదేశాలు జారీ చేయడం, క్యాడర్ ని తన వెంట తిప్పుకోవడంతో దొరబాబు అసలు ఏ కోశానా తట్టుకోలేకపోతున్నారుట.
దాంతో ఈ ఇద్దరు నేతలూ కలసి తిరిగిన సందర్భాలు పిఠాపురంలో ఎక్కడా కనిపించడంలేదు. మరో వైపు చూస్తే గీత తనకంటూ ఒక వర్గాన్ని అక్కడ తయారు చేసుకున్నారు. గతంలో ఆమె ఎమ్మెల్యెగా పోటీ చేయడంతో ఆమె మద్దతుదారులు కూడా ఉన్నారు. అధినాయకత్వం తన మాట వింటుందని, తాను ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగానే బరిలో ఉంటాను అని ఆమె తన వర్గానికి చెబుతున్నారుట.
ఇక దొరబాబు ఈ బాధేంటి బాబూ అని హై కమాండ్ పెద్దలను కలసినా అటు నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఏం చేయాలో తోచక హీటెక్కిపోతున్నారుట. ఇలా నడి మధ్యలో వచ్చి గీత తన రాజకీయ గీతను మార్చేయడమేంటి అని దొరబాబు ఆందోళనలో ఉన్నారని టాక్. ఇక వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల అభ్యర్ధులను మార్చడానికి వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది. ఇక గీత విషయం తీసుకుంటే ఆమె ఎంపీగా ఉన్నారు. సీనియర్ నేత. దాంతో ఆమె టికెట్ అడిగితే కాదనలేకపోవచ్చు అంటున్నారు.
మరి దొరబాబుని ఏం చేస్తారు అంటే టీడీపీ ప్లస్ జనసేన కలసి పోటీ చేస్తే తట్టుకోవడం కష్టమని భావించి ఆయన్ని తప్పించినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఇక కాకినాడ ఎంపీ సీటు చలమలశెట్టి సునీల్ కి కన్ ఫర్మ్ అయిన వేళ దొరబాబుకు సీటెక్కడ అంటే పార్టీ మళ్లీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తారేమో అంటున్నారుట. వైసీపీ తరఫున రెండు చాన్సులు టికెట్ ఇచ్చేశారు కాబట్టి దొరబాబుకు ఈసారి వాయిస్ చాయిస్ కూడా వైసీపీలో లేకపోవచ్చు అంటున్నారు. హై కమాండ్ ధీమతోనే గీత పిఠాపురం నాది అంటున్నారు అని కూడా చెబుతున్నారు. మొత్తానికి పిఠాపురం మాత్రం వైసీపీలో చిచ్చు రేపేలా ఉందిట.