డాక్టరు ఊర్లో ఉండాలి. నాయకుడు అందుబాటులో ఉండాలి. వైసీపీ రాష్ట్ర నేత - మహిళా నాయకురాలు ఆర్కే రోజా ఈరోజు తన కొత్త ఇంటిలోకి పతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. నా ప్రజల వద్దే నేనుంటానంటూ ఆమె గత ఏడాది ప్రకటించారు. అందులో భాగంగా నగరి నియోజకవర్గ కేంద్రంలో తన ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టి ఏడాదిలోనే పూర్తి చేశారు. శుక్రవారం శుభముహూర్తాన భర్త సెల్వమణితో కలిసి ఆమె కొత్త ఇంట్లో పూజలు నిర్వహించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో ఉంటేనే ప్రజలకు నాయకులకు మంచిది. వైసీపీ నేతల్లో తన మాటలతో తెలుగుదేశం నేతలకు నిద్ర లేకుండా చేసే వారిలో రోజా ఒకరు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ యాక్టివ్‌గా ఉండే రోజాకు వైఎస్ జగన్ కచ్చితంగా ఈసారి నగరి టిక్కెట్ ఇస్తారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మరోసారి విజయపతాక ఎగరేయాలని రోజా భావిస్తున్నారు. అందుకే ఇక నగరిలోనే ఉండాలని నిర్ణయించుకుని కొత్త ఇల్లు సిద్ధం చేసుకున్నారు.
ఈ రోజు గృహ ప్రవేశ కార్యక్రమానికి రోజా బంధువులు, పలువురు స్థానిక నేతలు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం గృహ ప్రవేశ దృశ్యాలను రోజా స్వయంగా తన ఫేస్ బుక్ పేజీలో పంచుకున్నారు.