వైఎస్ ఆర్ ఫొటోను మర్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే!

Update: 2020-06-24 06:30 GMT
ఏపీలో వైసీపీ ఏకపక్ష సునామీ తరహా విజయంలో ఎవరిదీ కీరోల్.. ఖచ్చితంగా వైఎస్ జగన్ పాదయాత్ర.. ఆయన స్వయంకృషి.. దివంగత వైఎస్ఆర్ పాత్ర  ఉంటుంది. జగన్ వేవ్ లోనే చాలా మంది ముక్కూ మొహం తెలియని వాళ్లు కూడా గెలిచేశారు. అమెరికా నుంచి దిగుమతి అయినవారు.. పోలీస్ అధికారులు.. ఇలా ప్రజల్లో లేని వాళ్లను కూడా జగన్ గెలిపించాడు. కేవలం  జగన్ పై  నమ్మకంగా జనాలు ఇలా వైసీపీ ఫ్యాన్ గుర్తుకు వేసి తమ ఎమ్మెల్యే ఎవరన్నది కూడా చూడకుండా గుద్దేశారు. అయితే కొందరు ఈ వాపును చూసుకొని బలుపు అనుకుంటున్నట్టున్నారే  అని చర్చ వైసీపీ క్షేత్రస్థాయి నేతల్లో సాగుతోంది.

వైఎస్ఆర్ అంటే లెక్కలేని అభిమానం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఆయన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. వైఎస్ ఆర్ ను జనాలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన పథకాలతో బతికిన వారు వైఎస్ ఆర్ ను దేవుడిగా కొలుస్తున్నారు.అలాంటి పరిస్థితుల్లో హెలిక్యాప్టర్ ప్రమాదంలో వైఎస్ ఆర్ చనిపోతే ఏపీ మొత్తం కన్నీరు కార్చింది. చాలా మంది గుండెలు ఆగిపోయాయి.

ఆ తరువాత పరిణామాల్లో  వైఎస్ జగన్ గుండె పగిలి చనిపోయిన వైఎస్ ఆర్ అభిమానుల కోసం కాంగ్రెస్ ను ఎదురించి వైసీపీ పార్టీని పెట్టి ఓదార్చారు. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోయినా పట్టు వదలకుండా పాదయాత్ర చేస్తే వైఎస్ఆర్ మీద అభిమానంతో ప్రజలు బ్రహ్మరథం పట్టి రాష్ట్రంలో 2019లో 151 సీట్లు సాధించి 51శాతం ఓట్లతో జగన్ ను ఏకపక్షంగా గెలిపించారు.
 
అయితే విచిత్రం ఏంటంటే వైఎస్ జగన్ ను అడ్డదిడ్డంగా తిట్టిన ప్రస్తుత చిలకూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీ చివరి నిమిషంలో సామాజికవర్గం పరంగా వైసీపీలో చేరి సీటు దక్కించుకుంది.. గెలిచింది.  వైసీపీ సీటు సాధించి వైఎస్ ఆర్ - వైఎస్ జగన్ గాలిలో గెలిచేసింది. అయితే తాజాగా ఎమ్మెల్యే రజినీ పుట్టిన రోజు వచ్చేసింది. ఇలాంటి కరోనా టైం అని కూడా చూడకుండా పెద్ద పెద్ద హోర్డింగ్ లను పెట్టి ఆ హోర్డింగ్ ల మీద తన పుట్టిన రోజు శుభాకాంక్షలను వేసుకుంది. అయితే అందులో వైఎస్ ఆర్ ఫొటో లేకుండా ఉండడం చూసిన వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. కావాలనే వైఎస్ ఆర్ ఫొటో లేకుండా విడుదల రజినీ ఫోకస్ అవుతున్నారని అని నియోజకవర్గంలో ప్రజలు - వైఎస్ఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీటు ఇస్తే వైఎస్ ఆర్ ఎందుకు గుర్తు ఉంటారు అని ఆమెకు సెటైర్లు వేస్తున్నారు. 
Tags:    

Similar News