వైకాపా అధినేత జగన్ కు షాకుల మీద షాకులు...దెబ్బల మీద ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నెల్లూరు వైకాపాలో ఫస్ట్ వికెట్ పడేందుకు సిద్ధంగా ఉంది. ఆ పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యే అధికార టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైకాపా స్టీరింగ్ కమిటీ సభ్యుడు - నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఉగాది ముహూర్తంగా టీడీపీలో చేరున్నారని తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఆయన గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
బాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణతో పాటు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుతో కలిసి సునీల్ కుమార్ చంద్రబాబును కలిశారు. టీడీపీలో ఆయన చేరికకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది. పార్టీలో చేరితే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు హామీపై సునీల్ చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. బాబును కలిసి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఇక సునీల్ గతంలోనే టీడీపీలో చేరతారని వార్తలు వచ్చినా వాటిని ఆయన ఖండించారు. సూళ్లూరుపేటకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ తోపాటు మంత్రి నారాయణ ప్రయత్నాలవల్లే సునీల్ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరో విశేషం ఏంటంటే గూడూరుకు చెందిన సునీల్ టీడీపీలో పాతకాపు కావడం విశేషం. ఆయన టీడీపీలో పలు పదవులు కూడా నిర్వహించారు. గత ఎన్నికలకు ముందు వైకాపాలో చేరి ఆ పార్టీ తరపున మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలో సీనియర్లతో వేగలేకపోయినా ఆయన మళ్లీ తన సొంత గూటికే చేరుతున్నారు.