తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ - ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య అసలు ఫైటే లేనే లేదు. అంతా చప్పిడి కూర టైపు. అదే ఏపీలో అధికార వైసీపీతో ప్రతిపక్ష టీడీపీ ఢీ అంటే ఢీ అంటోంది. ఏపీ పాలిటిక్స్ అప్ డేట్స్ పై దేశమంతా ఆసక్తి కనబరుస్తుంటాయి... ఉప్పు-నిప్పులా పార్లమెంట్ సాక్షిగా కొట్టుకుంటున్న వైసీపీ - టీడీపీ ఎంపీల తాజా వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది.
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఏపీలో టీడీపీ - వైసీపీ నేతల మధ్య వైరం ఉంది. అలాంటి నేతల మధ్య తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కావాలని అడిగిన మరుక్షణమే టీడీపీకి చెందిన ఎంపీ తన ఎంపీ ల్యాండ్స్ నుంచి ఏకంగా రూ.50లక్షలను అందజేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ - టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య ఈ అభివృద్ధి సయోధ్య కుదిరింది. విజయవాడ ఎంపీ నాని పరిధిలోని మైలవరం నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఇద్దరూ ఒక గాటినకు వచ్చి సహకరించుకొని నిధులు విడుదల చేసుకొని ప్రజలకు ఒక మంచి మేసేజ్ ఇచ్చారు.
ప్రజల కోసం - అభివృద్ధి కోసం వైసీపీ ఎమ్మెల్యే - టీడీపీ ఎంపీ ఏకమవ్వడం విశేషంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోరగానే ఆయన అభ్యర్థిత్వాన్ని మన్నించి ఏకంగా రూ.50 లక్షలను ఎంపీ కేశినేని విడుదల చేయడం విశేషం. ఇలా ఏపీ వ్యాప్తంగా ఇదే సయోధ్య కుదిరితే రాజకీయ వైశమ్యాలు తగ్గి అభివృద్ధి సాధ్యమని నేతలు - ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.