అసెంబ్లీలో తమ తమ ప్రసంగాలను ఏ మాత్రం లేట్ చేయకుండా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముందున్నారు. తమ తమ పేర్లతో ఫేస్ బుక్ పేజీలను కలిగిన వీళ్లు అసెంబ్లీలో తమ ప్రసంగం పూర్తి కాగానే..అందుకు సంబంధించిన వీడియోలను తీసుకుని సరిగ్గా తమ ప్రసంగం వరకూ కట్ చేయించుకుని ఫేస్ బుక్ లో పోస్టు చేయించుకుంటున్నారట.
అలా పోస్టు చేయించుకున్న తర్వాత ఎన్ని లైకులు వచ్చాయనే అంశం గురించి వారు చర్చించుకోవడం కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు ఈ అంశం మీద చర్చపెడుతున్నారు.
లాబీల్లో కలిసినప్పుడు ఎవరి ప్రసంగానికి ఎన్ని లైకులు వచ్చాయి - ఎవరికి ఎక్కువ లైకులు పడ్డాయి..అనే అంశం గురించి ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. ఈ విషయంలో వారి ఎగ్జయింట్ మెంట్ కనిపిస్తోంది. తమ ప్రసంగాలకు మంచి స్థాయిలో లైకులు రావడాన్ని కొందరు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇలా ఎక్కువ లైకులు వచ్చేందుకు కొందరు ఎమ్మెల్యేలు తమ సోషల్ మీడియా టీమ్ ను అలర్ట్ చేస్తున్నారని కూడా టాక్!