పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప‌ట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలు!

Update: 2020-01-29 05:58 GMT
పార్టీ నిర్దేశించిన అజెండాకు అనుగుణంగా ప‌ని చేయ‌డం విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇప్ప‌టికీ శ్ర‌ద్ధ చూపిస్తున్న‌ట్టుగా లేరు. పార్టీ నుంచి వ‌చ్చిన ఆదేశాల‌ను - చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌ను చేయ‌డంలో వైసీపీ ఎమ్మెల్యేలు మ‌రోసారి అనాస‌క్తినే ప్ర‌ద‌ర్శించారు. పొలిటిక‌ల్ హీట్ కొన‌సాగుతున్న వేళ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్ర‌మాల‌ను చేప‌ట్ట‌డంపై అనాస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. అస‌లు క‌థ ఏమిటంటే..

శాసనసభ - శాసనమండలి సాక్షిగా... తెలుగుదేశం పార్టీ - ప్రజాస్వామ్య విలువలను హరించడాన్ని - ఖండిస్తూ విద్యార్ధి - యువజనుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించింది. అలాగే ప్రభుత్వం అధికార - పరిపాలన వికేంద్రీకరణ చేసి 13 జిల్లాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన విధానాలను విద్యార్ధులు - యువజనులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ల‌డానికి కొన్ని కార్య‌క్ర‌మాల‌ను నిర్ణ‌యించింది. వాటిని వైసీపీ నేత‌లు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిల్లో అస్స‌లు ప‌ట్టించుకోలేదు!

-పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అన్ని విశ్వవిద్యాలయాల వద్ద చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నం. యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీలు - పాద‌యాత్ర‌లు.

-పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి - వికేంద్రీక‌ర‌ణపై యూనివ‌ర్సిటీల వ‌ద్ద స‌ద‌స్సులు నిర్వ‌హ‌ణ‌.

-పార్టీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో సంత‌కాల సేక‌ర‌ణ‌.

-వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో టీడీపీ తీరుపై రాష్ట్రప‌తికి పోస్టుకార్డులు పంపే ఉద్య‌మం.
 
ఈ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ చేప‌ట్టాల‌ని పార్టీ శ్రేణుల‌కు వైసీపీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి వ‌ర‌స‌గా ఈ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో ఎక్క‌డా ఈ కార్య‌క్ర‌మాల హడావుడి క‌నిపించ‌లేదు! వైసీపీ ఏపీలో 151 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచింది. అయితే ఇలాంటి పార్టీ ఆదేశాల‌ను మాత్రం క‌నీసం ప‌దిశాతం నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా పాటించి దాఖ‌లాలు లేవు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజ‌ర‌య్యే ప‌నుల్లో ఉండ‌వ‌చ్చు గాక‌. అయితే నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ అనుచ‌రుల‌కు ఈ మేర‌కు ఆదేశాల ఇవ్వ‌వ‌చ్చు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను జ‌రిపించ‌వ‌చ్చు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఈ ఆస‌క్తిని మాత్రం ప్ర‌ద‌ర్శించిన‌ట్టుగా లేరు! ఇదీ అస‌లు క‌థ‌.


Tags:    

Similar News