వైసీపీ ఎమ్మెల్యే ముచ్చట తీరిపోయింది..

Update: 2015-03-19 09:03 GMT
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి సస్పెండయ్యారు. పట్టిసీమ ప్రాజెక్టుపై రేగిన గందరగోళం శ్రుతిమించడంతో  వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎనిమిది మందిని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సస్పెండ్‌ చేశారు. శ్రీకాంతరెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చాంద్‌ భాష,ముత్యాల రెడ్డి, జగ్గిరెడ్డి, కొడాలి నాని లు సస్పెండ్‌ అయిన వారిలో ఉన్నారు. వీరిని మూడు రోజులపాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

కాగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పక్షపాత వైఖరి నశించాలి అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. విపక్ష నేత జగన్‌ కు మైక్‌ కట్‌ చేయడంపై వీరు ఆందోళన చేయగా, సభను వాయిదా వేసి తిరిగి ఆరంభమైన తర్వాత వారిని సస్పెండ్‌ చేశారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెండ్‌ కానప్పటికీ సభలో ఉంటూ వారి సస్పెన్షన్‌ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ సభలో రభస చేశారు. రెండుమూడు రోజులుగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడుతున్నా ఇంతవరకు స్పీకర్‌ సంయమనంతో సస్పెన్షన్‌ వరకు వెళ్లలేదు.. కానీ, గురువారం కూడా సభ సాగకుండా అడ్డుపడుతుండడంతో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.
Tags:    

Similar News