ఏపీలో అమరావతి రైతుల పాదయాత్ర ఇపుడు హాట్ హాట్ టాపిక్ గా ఉంది. ఒక వైపు ఉత్సాహంగా అమరావతి రైతుల పాదయాత్ర రోజుకు పది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం సాగుతూ ఉంటే మరో వైపు ఉత్తరాంధ్రా రాజకీయం కూడా సలసల మరుగుతోంది. అసలు అమరావతిలో యాత్ర మొదలుపట్టిన దగ్గర నుంచే ఉత్తరాంధ్రాలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందరూ అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రా వైపు రానే రావద్దు అంటూ గట్టిగా పేర్కొనడం విశేషం.
మంత్రి గుడివాడ అమరానాధ్ అయితే పాదయాత్ర ఆపుకోవడం బెటర్ అని సూచించారు. ఇక లేటెస్ట్ గా మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం అమరావతి రైతుల పాదయాత్ర మీద తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. అమరావతి రైతుల పాదయాత్రను తాము అడ్డుకోగలమని, అది అయిదు నిముషాల పని అంటూ ఆయన పరుషంగానే మాట్లాడారు.
ఇంకో వైపు చూస్తే రైతుల పాదయాత్ర విషయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రండ్ లీడర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే అందరి కంటే ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు. అమరావతి రైతులు గోదావరి జిల్లాలతో తమ కాళ్ళకు పని చెప్పి వెనక్కు వెళ్ళిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. అది దాటి కనుక వారు ఉత్తరాంధ్రాలో అడుగు పెడితే మాత్రం కచ్చితంగా ప్రమాదంలో పడినట్లే అని ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
ఉత్తరాంధ్రాలో అమరావతి రైతుల పాదయాత్ర కనుక మొదలైతే ఏం జరుగుతుందో కూడా ఏమీ చెప్పలేమని ఒకవేళ ఏ అవాంచనీయ ఘటన జరిగినా దానికి నూటికి నూరు శాతం చంద్రబాబు బాధ్యత వహించాలని దువ్వాడ పేర్కొనడం విశేషం. ఇక పాదయాత్ర చేస్తున్న వారు అంతా పెయిడ్ ఆర్టిస్టులని అందులో రైతులను చూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. కారు మీద ఎక్కి తొడ కొట్టిన వాళ్ళు మీసాలు తిప్పిన వాళ్ళు రైతులు ఎలా అవుతారు అని ఆయన నిలదీస్తున్నారు.
ఇక చంద్రబాబు అమరావతి రాజధానిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారనికి తెర తీశారని, అదే జగన్ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుతూ మూడు రాజధానుల కాన్సెప్ట్ ని ముందుకు తెచ్చారని దువ్వాడ గుర్తు చేశారు. దీని వల్ల అమరావతి రైతులకు వచ్చిన నష్టం ఏంటో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అమరావతిలో శాససభ ఉంటుంది కదా మరి ఎందుకు ఉద్యమాలు అని ఆయన ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రా ప్రజలు శాంతస్వభావులని, అదే సమయంలో ఇక్కడే ఉద్యమాలు అనేకం పుట్టాయని, పోరాటాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రాను ఎవరొ ఏ రూపేణా అయినా రెచ్చగొట్టినా లేక మనోభావాలను దెబ్బతీయాలని చూసినా సహించే ప్రసక్తి లేదని కూడా హెచ్చరించారు. ఉత్తరాంధ్రా ప్రజల వైపు ఉండకుండా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వత్తాసు పలుకుతున్న అచ్చెన్నాయుడుని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామని దువ్వాడ ప్రతిజ్ఞ చేసారు. మొత్తానికి ఉత్తరాంధ్రా వైపు వస్తే రైతుల పాదయాత్ర ముప్పు కోరి తెచ్చుకున్నట్లే అంటున్న దువ్వాడ కామెంట్స్ వెనక అర్ధాలు ఏంటో చూడాల్సి ఉంది మరి.