వైసీపీ నేత, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు నిజంగానే ప్రత్యేకమనే చెప్పాలి. తనను ఎంపీగా గెలిపించిన పార్టీ వైసీపీలోనే ఇంకా కొనసాగుతున్నా... ఆయన ఎప్పటికప్పుడు పార్టీ లైన్ ను దాటేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన రాజు గారికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ దఫా ఫుల్ క్లాసే పీకారు. అయినా కూడా రాజు గారిలో మార్పు రాలేదనే చెప్పాలి. తాజాగా కేంద్ర బడ్జెట్ సందర్భంగా పార్లమెంటులో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో ఎంపీ విజయసాయిరెడ్డి... నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను దునుమాడేశారు. అయితే అదే సమయంలో రాజు గారు మాత్రం నిర్మలమ్మ బడ్జెట్ ను ఆకాశానికెత్తేశారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ పై రాజు గారు ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘ఈ బడ్జెట్ పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నా. బడ్జెట్ అద్భుతంగా ఉంది. వ్యవసాయం, తాగునీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం సంతోషం. ఆక్వా రంగానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. ప్రస్తుతానికి ఏపీకి ఏమీ కేటాయించకున్నా... క్రియాశీలంగా వ్యవహరించి రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చుకుంటాం’’ అంటూ తనదైన శైలిలో రాజు గారు... మోదీ సర్కారు బడ్జెట్ ను ఆకాశానికెత్తేశారు. అంతేకాకుండా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ లో ఉన్న నిధుల విషయం తనకు తెలియదన్న రీతిలో ఆయన వ్యవహరించడం నిజంగానే ఆశ్చర్యం కలిగించక మానదు. ఓ వైపు విజయసాయిరెడ్డి... మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తమ పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోందని ప్రకటించిన మరుక్షణమే రాజు గారు ఈ తరహాలో నిర్మలమ్మ బడ్జెట్ ను కీర్తించడం గమనార్హం.
ఇదిలా ఉంటే... గతంలో బీజేపీలో కొంతకాలం పాటు కొనసాగిన రాజు గారు... ఏ కారణాల వల్లో తెలియదు గానీ... బీజేపీని వీడి వైసీపీలో చేరారు. ఎన్నికలకు కాస్తంత ముందుగా పార్టీలోకి వచ్చిన రాజుగారికి మంతి ప్రాధాన్యమే ఇచ్చిన జగన్... నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. రాజకీయాల్లో సత్తా చాటాలని ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న రాజు గారికి బీజేపీలో అంతగా కలిసి రాలేదు. అసలు రాజు గారిని పార్లమెంటులో అడుగుపెట్టేలా చేసిన పార్టీ వైసీపీనే. అలాంటి వైసీపీలో ఎంపీగా కొనసాగుతూ... బీజేపీని, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీని నిత్యం కీర్తిస్తూ వైసీపీలో అలజడి సృష్టించేలా వ్యవహరిస్తున్నారంటూ రాజు గారిపై ఇప్పటికే వైసీపీ వర్గాలు కుతకుతలాడుతున్నాయి. అయినా కూడా ఇవేవీ తనకు తెలియదన్నట్లుగా రాజుగారు.... వైసీపీని ఇరకాటంలోకి నెట్టేసేలా వ్యాఖ్యలు చేస్తుండటం మాత్రం మానడం లేదు. మరి ఇప్పుడు బడ్జెట్ పై రాజు గారి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.