రాష్ట్రపతి పాలన చివరిసారిగా ఉమ్మడి ఏపీలో 2014 ఎన్నికలకు ముందు పెట్టారు. దానికంటే ముందు అంటే కొన్ని దశాబ్దాల క్రితం పెట్టారు. అసలు రాష్ట్రపతి పాలన చాలా తక్కువ సందర్భాల్లో పెట్టిన రాష్ట్రాలలో ఏపీ ఒకటి. అటువంటి ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తరచూ అదే మాట వినిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల నుంచే విపక్షాలు దీన్ని ఒక స్లోగన్ గా మార్చుకున్నారు. ఏ సంఘటన జరిగినా దానికి రాష్ట్రపతిపాలనతో లింక్ పెడుతూ వచ్చారు.
రీసెంట్ గా చూస్తే టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు అన్న పాయింట్ ని పట్టుకుని చంద్రబాబు ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చారు. ఆయన రాష్టపతిని కలసి మరీ రాష్ట్రపతి పాలన ఏపీలో విధించాలని, శాంతిభద్రతలు బొత్తిగా దిగజారాయని ఫోటోలతో సహా చూపించారు. అయితే అవన్నీ టీడీపీ ఆఫీస్ మీద దాడులకు సంబంధించిన ఫోటోలు.
సరే ఆయన వినతి ఎలా ఉన్నా ఏపీలో రాష్ట్రపతిపాలన అన్నది కొన్నాళ్ళ పాటు సీరియస్ మ్యాటర్ గానే మీడియాలో నడిచింది. ఇపుడు మళ్లీ అదే మాట వినిపిస్తోంది. లేటెస్ట్ గా వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు లోక్ సభలోనే తమ సొంత ప్రభుత్వం మీదనే విమర్శలు చేశారు. ఏపీలో అర్జంటుగా రాష్ట్రపతిపాలన విధించాలని ఆయన కోరుకున్నారు.
ఏపీ ఆర్ధికంగా బాగా దిగజారిపోయిందని, ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని, దేనికీ నిధులు లేవని, ఆఖరుకు అప్పుల కోసం కార్పోరేషన్లు పెట్టి మరీ లెక్కకు మిక్కిలిగా రుణాలు తెస్తున్నారని అంటున్నారు. దాంతో ఆర్ధిక ఎమర్జెన్సీని విధించాలని, రాష్ట్రపతిపాలన పెట్టాలని కూడా డిమాండ్ చేశారు.
ఇక రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా ఏపీ అప్పుల కుప్పగా కనిపిస్తోంది. అదే విధంగా చాలా పెద్ద ఎత్తున బాకీలు ఉన్నాయి. ఇక అప్పు పుట్టదు అన్నట్లుగా పరిస్థితి ఏపీలో ఉంది అని అంటున్నారు. ఏపీలో ఆర్ధిక పరిస్థితుల మీద మాజీ ఆర్ధిక మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు మాట్లాడుతూ ఏపీ అన్ని విధాలుగా దారుణంగా తయారైందని అన్నారు. ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
మరి ఏపీలో పరిస్థితి చేయి దాటిపోయిందా. ఆర్ధిక క్రమశిక్షణ అత్యవసరం అవుతోందా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి అయితే లేదు, మరి ఏపీలో కనుక ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టాలంటే రాజ్యాంగం ప్రకారం ఉన్న అవకాశాలు ఏంటి అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.
ఆర్ధిక ఎమెర్జెన్సీ పేరిట చర్యలు తీసుకుంటే ఏపీలో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో మొత్తం ఆర్ధిక వ్యవహారాలను కేంద్రం తమ చేతుల్లోకి తీసుకుని గవర్నర్ కి అప్పగిస్తే ప్రభుత్వం ఉన్నా లేనట్లేనా అన్న వాదన కూడా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతున్న వారంతా ఇదే రకంగా అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఏపీలో ప్రభుత్వాన్ని వచ్చే బడ్జెట్ సమావేశలా తరువాత నడపడం కష్టమే అని చెప్పుకొచ్చారు.
అంటే అంతకంతకు పెరుగుతున్న అప్పులతో ఏపీ ఏ రోజు అయినా కుప్పకూలుతుందని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. మరి ఒక వైపు ఆర్ధిక దిగజారుడు తనాన్ని ఎవరూ కాదనలేరు, అయితే ఏపీలో ఇపుడు రాష్ట్రపతిపాలన పెడితే అది రాజకీయంగా మైనస్ అవుతుందా అన్న ఆలోచనలో ఏమైనా ఉంటే కేంద్ర పెద్దలు వెనకాడవచ్చు అంటున్నారు.
నిజానికి రాష్ట్రపతి పాలన పెట్టినా మరే విధంగా ఇబ్బంది కలిగించినా వైసీపీకే రాజకీయంగా లాభం అన్న మాట కూడా ఉంది. అలాగైతే మరి ఏం చేస్తారు, నిజంగా అంత దారుణంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయని కేంద్రం నమ్ముతోందా అన్న దాని మీదనే ఏపీ ఫ్యూచర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.