రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని, రైతులను కోటీశ్వరులను చేస్తానని, రాష్ట్రాన్ని అన్నపూర్ణను చేస్తానని చెబుతున్న చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారా? పక్క రాష్ట్రాల నుంచి చుక్కనీరు రాకపోయినా.. కూడా ఆయన పట్టించుకోవడం లేదా? సీమ ఎండిపోతున్నా.. ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియన పోలవరం ప్రాజెక్టును ప్రజలకు చూపిస్తూ.. ఏదో జరిగిపోతోందని ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారా? రాష్ట్ర రైతాంగం అప్పులు కూడా పుట్టక, చుక్క నీరు దొరకని పరిస్థితిలో అలమటిస్తుంటే.. బాబు మాత్రం తాను రాష్ట్రంలో 28 ప్రాజెక్టులు కట్టానని డప్పులు కొట్టుకుంటున్నారా? అంటే ఔననే అంటున్నారు వైసీపీ రైతు సంఘం నేతలు.
తాజాగా చంద్రబాబు వివిధ పత్రికల్లో ఇచ్చిన ఇరిగేషన్ ప్రకటనలు మంటలు పుట్టిస్తున్నాయి. లేనిది ఉన్నట్టు చూపిస్తూ.. రైతులకు తానే అన్నీ చేసేస్తున్నట్టు భ్రమలు కలిగిస్తున్న బాబుపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని చంద్రబాబు సహా టీడీపీ నేతలకు సవాలు రువ్వారు. హైదరాబాద్‌లో మంగళవారం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెబుతున్నవన్నీ కట్టు కథలుగానే పేర్కొన్నారు.
కరువుతో అల్లాడుతున్న రాయల సీమలో కనీసం వెయ్యి ఎకరాలకైనా నీరు ఇచ్చారా అని బాబును ప్రశ్నించారు. రాయలసీమలోని కేసీ కెనాల్ కింద పంటలు ఎండిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. దీనికితోడు ఏ రాష్ట్రమైనా తన పక్క రాష్ట్రం నుంచి అన్యాయం ఎదురైతే వెంటనే ఏదో విధంగా పోరాటానికి దిగుతుందని కానీ, బాబు మాత్రం మౌనంగా చూస్తున్నారని ముఖ్యంగా కర్ణాటకలో జలాశయాలు నిండినా.. ఏపీకి నీళ్లు రావడం లేదని, దీనిపై బాబు మౌనం ఎందుక వహిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. బాబు మౌనం వల్లే సీమలో కరువు తాండవం చేస్తోందన్నారు. కర్ణాటక ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయడం లేదని నిలదీశారు. కనీసం కృష్ణాబోర్డుకు కూడా చంద్రబాబు లేఖ రాయలేదని ఎద్దేవా చేశారు. మరి ఈ కామెంట్లకు టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.