అమ‌రావ‌తిలో వైసీపీ కార్యాల‌యం..జ‌గ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్‌

Update: 2017-10-09 17:54 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఆ పార్టీ కార్యకలాపాలను నిర్వహించాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు - కార్యకర్తల చిరకాల స్వప్నం నెరవేరింది. రాష్ట్ర కార్యాలయం సోమవారం సాయంత్రం 6 గంటలకు ఒంగోలు ఎంపీ - విజయవాడ పార్లమెంటు ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా కార్యాలయం పూర్త‌యింది. ఈ ప్రారంభోత్సవానికి పుంగనూరు శాసనసభ్యుడు - కృష్ణా జిల్లా పార్టీ ఇంచార్జీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు రాష్ట్ర స్థాయి నేతలు హాజరు అయ్యారు. విజయవాడ బందరు రోడ్డులోని ಆకాశ‌వాణి కేంద్రం ఎదురుగా ఈ కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇప్పటికే వామపక్ష పార్టీలు సహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి కేంద్రంగా తమ రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే హైదరాబాద్ నుండి తమ రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ విషయంపై అనేక సార్లు పార్టీ నాయకులు - కార్యకర్తలు సాంకేతికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ రాజకీయ కార్యకలాపాలను నిర్వహించేందుకు శాశ్వత భవన నిర్మాణం చేయాలని తలిచారు.

అయితే, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సమయాభావం వల్ల కనీసం తాత్కాలిక భవానాన్ని ఏర్పాటుచేసి, దాని ద్వారా అయినా కార్యకలాపాలు నిర్వహించాల్సిందేనని ఎన్నికల వ్యూహకర్త ప్ర‌శాంత్ కిషోర్ (పీకే) సూచించ‌డంతో ఆ దిశగా జగన్ తన తొలి అడుగు వేశారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు మొదటివారంలో ఒంగోలు ఎంపీ వైవీసుబ్బారెడ్డి అప్పటినుండి కేవలం రెండు మాసాల వ్యవధిలోనే ఈ కార్యాలయ నిర్మాణం పూర్తిచేశారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ ఛాంబర్ సహా ఏడు గదులతోపాటు సువిశాలమైన సమావేశ మందిరాన్ని కూడా నిర్మించారు. ఒకేసారి వంద మంది వచ్చినా కూడా వాహనాల పార్కింగ్‌ కు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించారు. ఈ కార్యాలయంలో జగన్ చాంబర్‌ తో పాటు పది గదులున్నాయి. వీటిలో విజిటర్స్ వెయిటింగ్ హాలు - ముఖ్య నేతలతో సమాలోచనకు ప్రత్యేక గది - పార్టీ ముఖ్యలుగా ఉన్నవారికి ఒక్కో గది చొప్పున మొత్తం ఏడు గదులను నిర్మించారు. అయితే, అనుబంధ విభాగాలకు కూడా ఇక్క డే చోటు కల్పించే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. వీరికి ఇంకా గదులు కేటాయించాల్సి ఉంది. కార్యాలయం ఎదురుగా జాతీయ జెండాకు - పార్టీ జెండాకు రెండు వేర్వేరు దిమ్మెలను ఏర్పాటుచేసి వాటిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

వారంలో మూడు రోజుల పాటు జగన్ ఇక్కడినుండే తన కార్యకలాపాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను ఒడిసి పట్లుకోవడానికి నిర్దిష్ట‌మైన కార్యాచరణ ప్రణాళికలను స్థానికంగా ఉండటం ద్వారా తయారు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ ముఖ్యనేతలు కూడా భావిస్తున్నారు. పార్టీ పరంగా పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ఏవిధంగా జరిగిందనే తీరుపైనా కూడా సరైన విశ్లేషణ జరుగలేదనే అపవాదు కూడా ఎదుర్కొంది. ఈ పరిస్థితులను దాటి ఎవరైనా ఏదైనా సమస్యతో ఇబ్బందిపడుతుంటే వారు నేరుగా కార్యాల‌యానికి వచ్చి, నాయకులతో తమ బాధను చెప్పుకునేందుకు ఈ కార్యాలయం నిర్మాణంతో వారికి వెసులుబాటు కల్పించినట్లయింది.
Tags:    

Similar News