ప్రచారం అంటే.. ప్రచారమే. అది మామూలుగా.. అట్టా ఇట్టా ఉండకూడదు. నిత్యం ప్రజల మధ్య కనిపిం చాలి. వారికి వినిపించాలి... వారి చర్చల్లోనూ కనిపించాలి. ఇదీ.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూ హం. ఈ క్రమంలోనే ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలను ప్రచారంలో భాగస్వామ్యం చేస్తోంది. అన్ని విభా
గాలు... దాదాపు ప్రచార పర్వంలోకి వెళ్లిపోయాయి. అయితే.. ఇది నేరుగా ఎన్నికలు అన్నట్టుగా ఉండదు.
తమ తమ విభాగాల ద్వారా.. ప్రజలకు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా వారు ప్రజలకు వివరిస్తారు. తమ తమ శాఖలు చేస్తున్న కార్యక్రమాలు.. దానివల్ల పొందిన లబ్ధి వంటివాటిని ప్రజలకు చేరవేస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రజాసంబంధాల శాఖ కొన్ని ప్రయోగాలు చేస్తోంది. అయితే.. ఇక, నుంచి అన్ని శాఖలు కూడా.. తాము ఏచేస్తున్నామనేది .. ప్రజలకు వివరించనున్నారు.
ప్రస్తుతం వివిధ పథకాల లబ్ధి దారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వారి బంధువుల నెంబర్లు కూడా ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఇవి కాకుండా.. టెలీకాం ప్రొవైడర్ల నుంచి కూడా ఫోన్ నెంబర్లను ప్రభుత్వం తీసుకుంటోంది. అంటే.. దాదాపు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు ప్రభుత్వ శాఖలకు చేరుతుంది. ఈ నెంబర్లకు ఆయా శాఖల నుంచి నిత్యం మెసేజ్‌లు వస్తాయి.
ఈ శాఖ ద్వారా.. ప్రభుత్వం ఈ కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనివల్ల మీరు, మీ కుటుంబం ఇన్ని లక్షల రూపాయల లబ్ది పొందారు. అని ఫోన్లకు మెసేజ్ వస్తుంది. అదేసమయంలో ఏమైనా డౌట్లు ఉంటే.. వాటిని పరిష్కరించుకునేందుకు ఆయా శాఖలకు టోల్ ఫ్రీ నెంబరు కూడా ఇస్తున్నారు. అంటే.. సదరు మెసేజ్‌ను డిలీట్ చేయకుండా.. చూసుకునే యత్నం అన్నమాట. అదేసమయంలో ఆయా పథకాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్‌లను కూడా ఈ నెంబర్లు ఉన్న వాట్సాప్‌కు ప్రభుత్వం పంపించనుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అంటే.. వైసీపీ సర్కారు ప్రచారం విభిన్న రూపంలో ఉండనుంది.
+ ఎమ్మెల్యేలు, మంత్రులతో గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా
+ గృహ సారథులతో ప్రతి యాభై ఇళ్లకు నిత్యం ప్రచారం
+ ఫోన్ సందేశాలు.. ఆడియో, వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రచారం
+ సినీ తారలను కూడా ఎన్నికల సమయంలో రంగంలోకి దింపనున్నారు
+ సీఎం జగన్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.
+ ఎన్నికల సమయానికిమరింతగా కలిసి వచ్చే వారిని కలుపుకొని ముందుకు సాగనున్నారు.
+ కరపత్రాలు, హోర్డింగులను ఏర్పాటు చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.