ఔను.. కొన్ని విషయాలు అంతే..పట్టించుకోకండి.. ఇదీ.. ఇప్పుడు వైసీపీ కీలక నాయకుడు.. ప్రభుత్వ సల హాదారు.. సజ్జల రామకృష్ణా రెడ్డి.. మరో నాయకుడు.. లేళ్ల అప్పిరెడ్డి చెబుతున్న మాట! తాడేపల్లి వర్గాల మధ్య ఈ విషయమే ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం ముమ్మ రంగా సాగుతోంది. సీమలో చాలా మంది నాయకులు తిరుగుతున్నారు. ఇక, ప్రకాశంలోనూ ఊపందుకుంది. మాజీ మంత్రులు, మంత్రులు కూడా ప్రజల మధ్య ఉంటున్నారు.
అయితే.. ఈ సందర్భంగా చాలా మంది నాయకులకు పరాభవం ఎదురవుతోంది. ఎక్కడికక్కడ ప్రజల నుంచి తీవ్రస్తాయిలో వ్యతిరేకత వస్తోంది. పథకాల అమలును కూడా వలంటీర్ల ఖాతాల్లోకి వేస్తున్నారు.
మంత్రులకు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని.. ప్రజల నుంచి సమాధానం వస్తోంది. దీంతో వారు తల్లడిల్లుతున్నారు. ఈ పరిణామాలతో బుర్ర వేడెక్కుతున్న నాయకులు.. ఇలా ఎందుకు జరుగు తోందనే అంశంపై వారు తాడేపల్లికి ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈ విషయంతో.. ఎమ్మెల్యేలు, మంత్రులు మనస్తాపానికి గురవుతున్నారని.. గుర్తించిన పార్టీ అధినేత.. వారిని బుజ్జగించే కార్యక్రమానికి తెరదీశారు.
వార్తల్లో వస్తున్న వ్యాఖ్యలు.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక త వంటివాటిపై వెంటనే సదరు నేతలకు పోన్లు చేస్తున్నారు. ఆయా విషయాలు పట్టించుకోవద్దని.. సూచిస్తున్నారట. అంతేకాదు.. ఇవన్నీ.. కావాలనే జరుగుతున్నాయని.. ప్రతిపక్ష నేతలు రెచ్చగొడుతున్నారని.. కాబట్టి.. వేరే చోట్లకు వెళ్లాలని.. నియోజకవర్గంలో మిశ్రమ స్పందన అన్నిచోట్లా కనిపిస్తోందని బుజ్జగిస్తున్నారట.
ఇక, ఇదేసమయంలో వలంటీర్లను ముందుగానే పంపించి.. తమకు పాజిటివ్ టాక్ ఉంటుందని.. వస్తుందని భావిస్తున్న ప్రాంతాల్లోనే మంత్రులు పర్యటిస్తున్న పరిస్థితి మరికొన్ని చోట్ల కనిపిస్తోంది. దీంతో గడప గడప కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా మారింది. ఇదీ.. సంగతి!