రెండంటే రెండు కీలక నిర్ణయాలు ప్లీనరీ వేదికగా వినిపించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఓ విధంగా రెండేళ్ల తరువాత (ఇంకా చెప్పాలంటే పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తోన్న తొలి ప్లీనరీ కావడంతో పలు జాగ్రత్తలతో సీఎం తనదైన ప్రకటనలు చేసి అందరినీ ఆకట్టుకోవడమో లేదా ఆశ్చర్యపరచడమో చేయనున్నారు. ఈ ప్లీనరీలో జనసమీకరణకు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.
అదేవిధంగా విపక్షాలపై విమర్శలు కన్నా ప్రజలకు చేసిన మేలు, చేయాల్సిన మేలు ఈ రెంటి గురించే మాట్లాడి ఆకట్టుకుని తీరాలని సీఎం భావిస్తున్నారు. అదేవిధంగా రెండ్రోజుల ప్లీనరీలో నియోజకవర్గాల వారీగా రివ్యూలు ఉంటాయి అని, వాటి గురించి వేదికపై నుంచి జగన్ మాట్లాడి సంబంధిత ప్రతినిధుల నుంచి సమాధానాలు రాబడతారని తెలుస్తోంది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మరో ఆసక్తికర ప్రకటన వస్తే రావొచ్చు..అని తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త పథకాలపై రూపకల్పన చేయాలని ఇప్పటికే సంబంధిత వర్గాలను ఆదేశించారని సమాచారం. వాటి రూపు ఏంటన్నది జగన్ చెబితే కానీ వెల్లడిలోకి రాదు.
ఆంధ్రావనిలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా సంక్షేమ పథకాల పేరిట నిధులు వెచ్చిస్తూనే ఉంది వైసీపీ సర్కార్. తాజాగా కూడా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలుస్తోంది. ప్లీనరీ వేదికగా వాటి గురించి మాట్లాడాలని భావిస్తోంది. అంటే ఇంకా ఇంకొన్ని సంక్షేమ పథకాలు రానున్నాయన్నది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అసలే ఆర్థిక భారంతో నడుస్తున్న ప్రభుత్వానికి అప్పుల భారంతో నడుస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడివన్నీ ఎందుకు అని ఓ ప్రశ్న విపక్షం నుంచి వస్తోంది. లక్షా నలభై వేల కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని ఇప్పటిదాకా నడిపిన వైఎస్ జగన్ మరోవైపు మరికొన్ని సంక్షేమ పథకాలకు అప్పులు చేయనున్నారు అని తెలుస్తోంది. అందుకు రానున్న జూలైలో వచ్చే ప్లీనరీనే వేదికగా చేసుకుని ప్రకటనలు చేయనున్నారు.
అందరి ఎదుట అడిగేస్తాడు.,. కడిగేస్తాడు
ఇక ఇప్పటిదాకా ప్రజాప్రతినిధుల పనితీరును విశ్లేషిస్తూ వెళ్లిన జగన్ వీటిని బహిర్గతం చేయనున్నారు అని తెలుస్తోంది. ఇంటర్నల్ ఇష్యూస్ ను ఔట్ ఫోకస్ లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. అంటే అందరి ముందు అన్ని విషయాలూ చెప్పి ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు పంపనున్నాని కొందరు సొంత పార్టీ వర్గాల వారే అంటున్నారు. ఇదే కాదు కొన్ని పేర్లను చదివి, వారికే టికెట్లు అని చెప్పే అవకాశాలూ ఉన్నాయి. తొలి జాబితా ప్లీనరీ వేదికగా విడుదల చేసే అవకాశాలున్నాయి అని కూడా తెలుస్తోంది.