వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను తొలిసారిగా విజయవాడలో ప్లీనరీ నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. జూలై 8 - 9 తేదీల్లో ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున పార్టీ ప్లీనరీ ప్రారంభమవుతుంది. గత ప్లీనరీలన్నీ ఇడుపాయలపాయలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈదఫా విజయవాడలో ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు.
జూలై 8 -9 తేదీల్లో విజయవాడలో పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని, జూన్ 19 - 20 -21 తేదీల్లో వైఎస్ ఆర్ సీపీ జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని ఉమ్మారెడ్డి వివరించారు. ఆ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు జిల్లా ప్లీనరీ సమావేశాలు ఉంటాయన్నారు. ఇక మే చివరివారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు, రెండోదశలో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ అంశాలపై కులంకుషంగా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్ లో తెలంగాణ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాలన్నీ రాష్ట్ర స్థాయి పార్టీ కార్యాలయానికి పంపించాలని ఉమ్మారెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలకు కలిపి విజయవాడలోనే సమావేశాలు జరుగుతాయని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ప్లీనరీకి 13వేల మంది ఆహ్వానితులు వచ్చే ఆస్కారముందని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మారెడ్డి తెలిపారు.
ఇదిలాఉండగా....గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిని విద్యార్థులు అడ్డగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి నాయకులు మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/