మనం చేస్తే శృంగారం...మరొకరు చేస్తే వ్యభిచారం...అన్నట్లుంది ఏపీలోని కొన్ని రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం వ్యవహారం. కొంతమంది అధికారుల అత్యుత్సాహం...వల్ల మొత్తం వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని అడ్డుకున్న రమేష్ కుమార్....ఏకంగా ఎన్నికలనే రద్దు చేశారు. ఈసీ నిర్ణయాన్ని మాజీ సీఎం చంద్రబాబు కూడా స్వాగతించారు. అయితే, గత ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్నపుడు తాను కూడా ఇదే తరహాలో రుణమాఫీ, పసుపు కుంకుమ, ఎన్టీఆర్ గృహపథకం వంటి పథకాలు అమలు చేసిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు.
2019 ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా...ఆ మాటకొస్తే ...పోలింగ్ రోజున కూడా రైతులు, మహిళల ఖాతాల్లో నగడు జమ అయిన దాఖలాలున్నాయి. దీనిపై ఇదే ఈసీ రమేష్ కుమార్....వివరణ ఇచ్చారు. ఆ పథకాల ద్వారా లబ్ధి ఎన్నికలకు ముందే నిర్ణయించారని...కాబట్టి అది కోడ్ ఉల్లంఘన కిందకు రాదని క్లారిటీ ఇచ్చారు. అయితే, వాటిపై నాడు ప్రతిపక్షం లో ఉన్న వైసీపీ కూడా అభ్యంతరం చెప్పలేదు. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే...ఉగాది నాటికి 25లక్షల మందికి ఇళ్లపట్టాలు అందజేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే 8నెలలుగా అధికారులు భూసేకరణ ...తదితర కార్యక్రమాలు పూర్తి చేశారు. అయితే, కోడ్ ఉన్నందున ఇళ్ల పట్టాల పంపిణీ చేయకూడదని ఈసీ రమేష్ ఆదేశించారు. అంతేకాదు....కరోనా సాకు తో ఏకంగా ఎన్నికలనే వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ అభ్యంతరం తెలిపింది. కులాల ఆధారంగా రమేష్ కుమార్ పని చేస్తున్నారని ఆరోపించింది. గత ఎన్నికల్లో పసుపు కుంకుమ, రుణమాఫీపై అభ్యంతరం తెలపని రమేష్ కుమార్...ఇపుడు పట్టాల పంపిణీ ఎందుకు అడ్డుకుంటున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు ఈసీ జవాబేది? ఇక, ఎన్నికల సమయంలో చెదురుమదురు ఘటనలపై ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకోవడంపై కూడా వైసీపీ మండిపడుతోంది. 2019 ఎన్నికల సమయం లో ఘర్షణలపై నాడు అధికారంలో ఉన‌్న బాబు ధర్నాలు చేశారు. ఈసీ కేంద్రం చెప్పినట్లు ఆడుతోందని...ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటోందని బాబు ఆరోపించారు. నాడు ఈసీని తప్పుబట్టిన బాబు....ఇపుడు జగన్ ఈసీని విమర్శిస్తే మాత్రం..నానా యాగీ చేస్తున్నారు. ఈసీని చంద్రబాబు విమర్శిస్తే న్యాయం....జగన్ విమర్శిస్తే అన్యాయమా? ఈసీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఒక్క చంద్రబాబుకే ఉందా? నాడు బాబు చేసింది రైట్ అయితే...నేడు జగన్ చేసింది కూడా రైటే కదా?