ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అత్యుత్సాహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలైన గంటల వ్యవధిలోనే కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు.. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న పూలదండ తీసి పారేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇదే వీడియోలో.. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న పూలదండను తీసి వేసిన కార్యకర్తలు.. ఆ వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను వేయటం.. ఆనందోత్సాహాల్ని ప్రదర్శించటం కనిపించింది. ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందిదన్న విషయం మీద క్లారిటీ రానప్పటికీ.. ఐదుగురు యువకులు చేసిన ఈ పనిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఎన్నికల ఫలితాలు విడుదలైన గంటల వ్యవధిలోనే ఇలాంటివి జరిగితే.. రానున్న ఐదేళ్లలో ఇంకేం జరుగుతుందన్న సందేహాలు సోషల్ మీడియాలో పలువురు వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఉత్సాహాన్ని ఎవరూ కాదనలేరు కానీ.. ఇలా కొందరి మనోభావాల్ని ప్రభావితం చేసే చర్యల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయం చేతికి రావటం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడొచ్చిన గెలుపు సామాన్యమైనది కాదన్నది మర్చిపోకూడదు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మరింత బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరీ.. వైరల్ వీడియో విషయంలో పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి