వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు ఫోన్ రీచార్జ్ లకు డబ్బులు లేవా?
2009 నుంచి 2019 వరకు జగన్ ఫొటో పెట్టినా.. వైఎస్ఆర్ ఫొటో పెట్టినా లక్షల్లో లైక్ లు వచ్చేవి. వైఎస్ జగన్ ఒక ప్రకటన ఇస్తే లక్షల్లో షేర్లు జరిగేవి. జగన్ వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులవుతోంది.. ఏమైంది? వైసీపీ సోషల్ మీడియా ఎందుకు చచ్చుబడిపోతోంది అని అందరూ ఆరాతీస్తున్నారు.. దీనికి కారణం ఏంటంటే.. అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలల కాలంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ల పరిస్థితి దారుణంగా తయారు కావడమేనట..
2009 నుంచి 2019 వరకు జగన్ ను గెలిపించండని సొంతంగా తల్లిదండ్రులను అడిగి మరీ రీచార్జ్ చేసుకొని వైసీపీ అభిమానులు జగన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ ఈరోజు రీచార్జ్ అంటేనే తల్లిదండ్రులు తొక్క తీస్తా అని వైసీపీ అభిమానులైన తమ సంతానంపై మండిపడుతున్నారట.. ‘ఒక రేషన్ కార్డ్ లేదు.. తీసుకురాలేవు.. వైసీపీ వాడు అని తెలిస్తే పింఛన్ రాదు.. వైసీపీ వాళ్లకు సంక్షేమ పథకాలు రావు.. ఎందుకు మా డబ్బులు ఇచ్చి దండగ చేసుకోవడం’ అని తల్లిదండ్రులు ఇవ్వడం మానేస్తున్నారట..
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎమ్మెల్యేల దగ్గరికి వెళితే.. ‘అయ్యా.. మీరు జగన్ , వైఎస్ఆర్ ఫ్యాన్స్. మా ఫొటోలు.. వీడియోలు పెట్టరు.. మేము మీకెందుకు చేయాలి..?’ అని ముఖం మీదే చెప్పేస్తున్నారట..అదే టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తే మేము చెప్పినట్టు విని పనులు చేసుకుంటారు.. మీకు చేస్తే మేము రేపు పార్టీ మారితే రారు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారట.. మమ్మలను నమ్ముకున్న వాళ్లకు చేస్తాం.. ‘మీరు జగన్ ను నమ్ముకున్నారు.. జగన్ నే అడగండి’ అని ఎమ్మెల్యే సెలవిస్తున్నారట..
అందుకే పార్టీని నమ్ముకోవాలి కానీ.. వ్యక్తులను నమ్ముకోవద్దు అంటూ.. అప్పుడే పనులు అవుతాయని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇప్పుడు బాధపడుతున్నారట. ఏపీ సీఎం 50వేల కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినా సోషల్ మీడియాలో లైక్ లు లేవు.. షేర్ లు లేవు.. ఎందుకని ఆరాతీస్తే.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ సైలెంట్ అయ్యారని.. అందుకే జగన్ ప్రజా పాలనకు ప్రచారం కరువైందని వైసీపీలో గుసగుసలాడుకుంటున్నారు. ఎంతైనా ప్రతిపక్షంలో ఉండగా ఎవరూ తమను నమ్ముకున్నోళ్లకు ఏమీ చేయలేరు.. కనీసం అధికారంలో ఉన్నప్పుడైనా నమ్మినోళ్లకు పట్టెడన్నం పెడితే వాడు గుండెల్లో పెట్టుకుంటాడు. ఈ చిన్న లాజిక్ ను మరిచిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు ప్రాణమిచ్చే వారిని పక్కనపెడుతోందన్న ఆవేదన వైసీపీ అభిమానుల్లో నెలకొంది.