వైసీపీ బిగ్ స్ట్రాటజీ : టీడీపీ జనసేనకు ఒక్క దెబ్బతో జవాబు....?

Update: 2022-11-08 02:30 GMT
రాజకీయాల్లో ఎపుడూ వ్యూహాలే విజయాలు సాధిస్తాయి. ఏపీలో కూడా ఇపుడు వైసీపీ ఒక భారీ రాజకీయ వ్యూహానికి తెర తీస్తోంది. అదే పనిగా తమ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ రోజు రోజుకీ డోస్ పెంచుతున్న టీడీపీ జనసేనలకు ఒక్క దెబ్బకు జవాబు చెప్పాలని అనుకుంటోంది. దానికి అందివచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. విశాఖకు చెందిన టీడీపీ మాజీ మంత్రి నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రెండేళ్ల క్రితమే రాజీనామా చేశారు. అది ఇపుడు పెండింగులో ఉంది. స్పీకర్ తమ్మినేని సీతారామ్  డెసిషన్ తీసుకుంటే ఏ కషణమైనా ఆమోదం పొందుతుంది. అపుడు గంటా మాజీ ఎమ్మెల్యే అవుతారు. గంటా కూడా తన రాజీనామాను ఆమోదించామని తాజాగా డిమాండ్ చేశారు.

ఆ విధంగా విశాఖ నార్త్ లో ఉప ఎన్నిక వచ్చి పడుతుంది. దాంతో పాటు విశాఖలో పాలనారాజధాని సహా మూడు రాజధానుల కోసం వైసీపీ పోరాటం చేస్తోంది. దానిలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయన రాజీనామా కూడా ఆమోదిస్తే రెండు చోట్లా ఉప ఎన్నికలు వస్తాయని ఆలోచిస్తున్నారు.

అలా ఎన్నికలు రప్పించి రెండు చోట్లా వైసీపీ గెలిచేలా వ్యూహ రచన చేస్తే ఈ దెబ్బకు ఎన్నికల వేళ దాకా విపక్షాలకు సౌండ్ లేకుండా పోతుందని వైసీపీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు. విశాఖ నార్త్ కి బై పోల్ వస్తే గంటా శ్రీనివాసరావు పోటీలో ఉంటారా లేదా అన్నది చర్చగా ఉంది. ఆయన పోటీ చేస్తే జనసేన ద్దతు ఇస్తే ఆ రెండు పార్టీల బలాబలాలు అంచనా వేసుకోవడానికైనా ఈ ఉప ఎన్నిక అధికార పార్టీకి అవసరం అని అంటున్నారు.

అలాగే చోడవరం లో ధర్మశ్రీ రాజీనామాను ఆమోదించి ఉప ఎన్నికను తెస్తే అక్కడ మూడు రాజధానుల నినాదాన్ని బలంగా వినిపించాలని వైసీపీ చూస్తోంది. ఇక్కడ కూడా పోటీలో జనసేన నిలబడుతుందా లేక టీడీపీ పోటీ చేస్తుందా అన్నది కూడా చర్చకు వచ్చే అంశమే. ఇలా సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన టీడీపీల అసలు బలం ఎంత, వాటి మధ్య పొత్తు బంధం ఎంత దాని శక్తి ఏపాటిది వంటి అంశాలు వైసీపీ స్టడీ చేయడానికి ఈ రెండు ఉప ఎన్నికలను తెస్తుందా అన్నదే ఇక్కడ పాయింట్.

ఇదిలా ఉంటే విశాఖకు ఈ నెల 11, 12 తేదీలలో టూర్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఉంచాలని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతుననరు. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆయన వినతి చేస్తారు అని అంటున్నారు.

ప్రధాని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సానుకూలంగా స్పందిస్తే అపుడు ఈ ఉప ఎన్నికలూ ఉండవు, రాజకీయమూ ఉండదని చెబుతున్నారు. అలా కకుండా ఉంటేనే ప్రధాని టూర్ అనంతరం వైసీపీ గంటా రాజీనమా విషయంలో సీరియస్ గానే ముందుకు వెళ్తుందని అంటున్నారు. చూడాలి మరి ఉప ఎన్నికలు కనుక వస్తే వైసీపీ జనసేన టీడీపీ కూటమిని చిత్తు చేసి గెలుస్తుందా వాటికి తగిన జవాబు చెబుతుందా అన్నది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News