వైసీపీ సూప‌ర్ డెసిష‌న్!

Update: 2018-03-16 14:30 GMT
వైసీపీ పురిటి బిడ్డ‌. జ‌గ‌న్‌ ను ఎదుర్కోవ‌డం మాకు చిటికేసినంత ఈజీ అనుకుని గ‌తంలో ప‌లుమార్లు న‌వ్వుకున్న చంద్ర‌బాబు... వైసీపీ అధినేత జ‌గ‌న్ తెగువ చూసి షాకుల మీద షాక్‌ లు తింటున్నాడు. జ‌గ‌న్‌ చాణక్యానికి ఖంగు తింటున్నాడు. అస‌లు వైసీపీ అవిశ్వాసం పెట్ట‌కుండా త‌ప్పించుకుంటేదేమో అని, ఒక వేళ పెట్టినా మాట‌ల‌తో భ‌య‌పెడ‌దామ‌ని చూసిన బాబే ఇపుడు భ‌య‌ప‌డుతున్నాడు. త‌ను ఊహ‌ల్లో బ‌తుకుతూ అవిశ్వాస తీర్మానం వ‌ల్ల ఏమీ ఒర‌గ‌దు అన్నాడు. మోడీతో క‌లిసి గేమ్ ఆడుతున్నారు, వాళ్లు ఎలాగూ తీర్మానం పెట్ట‌రు అన్న భ్ర‌మ‌లో ఉన్న బాబుకు ఒక్క సారిగా మ‌బ్బులు తొల‌గిపోయాయి.

ఈరోజు వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. అది స్పీక‌ర్ టేబుల్ మీద‌కు చేర‌డ‌మూ జ‌రిగింది. ప‌లువురు వైసీపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం జ‌రిగింది. స‌భ వాయిదా ప‌డ‌టంతో చ‌ర్చ‌కు రాలేదంతే. అయితే, మొత్తం త‌న‌ చేజారిపోయింద‌ని బాబుకు అర్థం అయిపోయింది. మొన్న‌టి దాకా అవిశ్వాసం వేస్టు అని చెప్పిన బాబు వైసీపీ అవిశ్వాసం పెడితే మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తాం అని చెప్పారు. తీరా పెట్టాక మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్టే ప్ర‌క‌టించి *లేదు...లేదు.. * అని ప్లేటు ఫిరాయించారు. ఎక్క‌డ వైసీపీకి మైలేజీ వ‌స్తుందేమో అని వెంట‌నే ఈరోజు టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. తాము కూడా తీర్మానం పెట్టాం కాబ‌ట్టి వైసీపీకి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌జ‌లకు క‌ల‌రింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇప్ప‌టికే అనేక షాకుల‌తో డంగ‌యిన బాబుకు తాజాగా వైసీపీ నేత - ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో గ‌ట్టి షాక్ ఇచ్చారు.

మాకు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం కోసం ఎవ‌రికి అయినా మ‌ద్ద‌తు ఇస్తాం. వారు మా తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. అది వారి రాజ‌కీయం. కానీ మాకు రాష్ట్రం ముఖ్యం. అందుకే మేము వారి అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇస్తాం అని స్ప‌ష్టం చేశారు. దీంతో టీడీపీ గొంతులో వెల‌క్కాయ ప‌డిన‌ట్ల‌యింది. పైగా టీడీపీ అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వదంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని విజ‌య‌సాయిరెడ్డి వెల్ల‌డించారు.  ఇపుడు ఏం మాట్లాడాలో కూడా తెలియ‌ని అయోమ‌య స్థితిలో ప‌డిపోయింది టీడీపీ టీం. దీనిపై ఇంకా చంద్ర‌బాబు గాని టీడీపీ నేత‌లు గాని స్పందించ‌లేదు.
Tags:    

Similar News