ప్రభావం చూపించినా.. చూపించకున్నా.. సమయానికి తగ్గట్లుగా కొన్ని పనులు చేయటం రాజకీయాల్లో మామూలే. తమ వాదనను వినిపించేందుకు విపక్షానికి ఉన్న అయుధాల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి. బాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్న ఏపీ విపక్షం తాజాగా అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది.
బాబు సర్కారు మీద ఏపీలోని అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని.. ఆ కారణంగానే తాము ప్రభుత్వం మీద అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ కు అందచేశారు. ఈ విషయాన్న జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వెల్లడించారు.
తామిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ సమావేశాల్లోనే చర్చకు అనుమతించాల్సిందిగా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మరి.. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.