ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని రీతిలో ఏపీలో అవినీతి రహిత చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దేశంలో అవినీతికి సంబంధించిన ర్యాంకింగ్స్ లో కూడా ఇప్పుడు ఏపీ మెరుగైన స్థితికి చేరింది. చంద్రబాబు నాయుడి హాయాంలో అవినీతిలో ఏపీ టాప్ త్రీ, టాప్ ఫైవ్ ప్లేస్ లలో ఉండేది.
అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న నేపథ్యంలో.. అవినీతి రహితం దిశగా వెళ్తోంది ఏపీ. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీ మెరుగైన స్థితిలో ఉంది. ఇంకా పరిస్థితి మరింత మెరుగు పడాల్సి ఉంది. అవినీతి తగ్గాల్సి ఉంది. ఈ విషయంలో సీఎం జగన్ చర్యలు మెచ్చుకోదగినట్టుగా ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే తీరు ఇలానే ఉందని సమాచారం. ఆయన ఒక వ్యాపార ప్రముఖుడికి ఫోన్ చేసి మూడు కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆ వ్యాపార ప్రముఖుడు ఇటీవలే భారతీయ జనతా పార్టీలోకి చేరాడు కూడా. అయినా.. తన వాటా ఇవ్వాలంటూ ఆయనను వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారట.
అమిత్ షా ఆధ్వర్యంలో ఆ వ్యాపారి ఇటీవల కమలం పార్టీలో చేరాడు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఆ ఎమ్మెల్యే తగ్గకపోవడం విశేషం. ఆ ఎమ్మెల్యేకు ఇలాంటి చేష్టలు కొత్తవి కూడా కావని తెలుస్తోంది. ఆయన గతంలో కూడా ఈ తరహా దందాకు పాల్పడగా..అప్పుడు కూడా సీఎం జగన్ వారించినట్టుగా తెలుస్తోంది. అయినా ఆయన తన తీరును మార్చుకోవడం లేదని సమాచారం. ఇలాంటి వారి విషయంలో సీఎం జగన్ మరింత తీవ్రమైన చర్యలు తీసుకోక తప్పేట్టుగా లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న నేపథ్యంలో.. అవినీతి రహితం దిశగా వెళ్తోంది ఏపీ. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీ మెరుగైన స్థితిలో ఉంది. ఇంకా పరిస్థితి మరింత మెరుగు పడాల్సి ఉంది. అవినీతి తగ్గాల్సి ఉంది. ఈ విషయంలో సీఎం జగన్ చర్యలు మెచ్చుకోదగినట్టుగా ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. కొంతమంది వైసీపీ నేతలు మాత్రం సీఎం లక్ష్యాలను ఇంకా పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. వారు తమ తీరును మార్చుకుంటున్నట్టుగా లేరు. రాజకీయాల్లోకి వచ్చింది దండుకోవడానికే అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారని స్పష్టం అవుతోంది.