ఇంగ్లండ్ తో ఇటీవల ఆడిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అయితే మాములు విజయం అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కానీ ఈ మ్యాచ్ లో ఓ అద్భుతం జరిగింది. కష్ట కాలంలో.. ఇక టీం ఓడిపోతుందనుకుంటున్న దశలో ఏమాత్రం అంచనాలు లేని రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
దీంతో అతనిపై తోటి క్రికెటర్లతో పాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. జట్టుకు కీలకంగా వ్యవహరించిన విజయాన్నందించిన రిషబ్ ను 'ముప్పావ్ గంట సేపు మోటివేషన్ చేస్తే జట్టుకు చిరస్మరణీ విజయాన్ని అందించావ్' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో క్రీడాభిమానులు ఇలా ట్వీట్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఈ ఆదివారం చివరి మ్యాచ్ జరిగింది. అప్పటికే ఓ మ్యాచ్ కోల్పోయిన జట్టు కష్టాల్లోనే మైదానంలోకి అడుగుపెట్టింది. అనుకున్నట్లుగానే 72 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు తీవ్ర నిరాశలో పడింది. ఇక మ్యాచ్ పోయినట్లే అని అనుకుంటున్న సమయంలో రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. అయితే ఎప్పటిలాగే రిషబ్ పంత్ పై ఎవరూ అంచనాలు వేసుకోలేదు. కానీ అతనికి హార్థిక్ పాండ్యా తోడయ్యాడు. ఇద్దరు కలిసి 55 బంతుల్లో 10ఫోర్లతో 71 పరుగులు చేశాడు. ఇక రిషబ్ పంత్ చివరి వరకు కొనసాగుతూ 125 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో 2-1 మ్యాచ్ లతో టీమిండియా విజయం సాధించింది.
జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించావని క్రీడాభిమానులు రిషబ్ పంత్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించాడు. నా మోటివేషన్ నీకు పనిచేసిందని అన్నాడు. అయితే గత కొంతకాలంగా రిషబ్ పంత్ కు యువరాజ్ అండగా ఉంటూ వస్తున్నాడు. బ్యాటింగ్ లో అతనికి మెళకువలు నేర్పుతూ మానసికంగా ట్రైనింగ్ ఇస్తన్నాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కంటే ముందు 45 నిమిషాల పాటు అతనితో మాట్లాడినట్లు యువరాజ్ తెలిపాడు.
గతంలోనూ చాలా సార్లు రిషబ్ పంత్ తరుపున యువరాజ్ నిలిచేవాడు. 2019 వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ 'రిషబ్ ఎన్నోసార్లు అవుట్ కావడం చూస్తూనే ఉన్నాం.. అందేకే ఆయనను టీమ్ కు సెలక్టె చేయలేదేమో..' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు యువరాజ్ సింగ్ రిప్లై ఇచ్చాడు. 'రిషబ్ ఇప్పటి వరకు ఆడింది కేవలం 8 వన్డేలే.. అప్పుడే అతని తప్పులు తీస్తే ఇలా.. కాస్త సమయం ఇవ్వండి.. నేర్చుకుంటాడు... అయినా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు థ్యాంక్స్' అని అన్నాడు. ఇలా రిషబ్ పంత్ పక్షాన యువరాజ్ సింగ్ ఉంటూ వస్తున్నాడు.
అయితే ఈ వరల్డ్ కప్ తరువాత అతను ఫాంలో లేకపోయినా పలు సిరీస్ లకు సెలక్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ యువరాజ్ సింగ్ తనకు అండగా ఉంటూ ప్రతి ఒక్కిరిక సమాధానం ఇస్తూ వస్తున్నాడు. అటు రిషబ్ కు అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తున్నాడు. ఎప్పటికైనా తన మోటివేషన్ పనిచేస్తుందని భావించిన యువీ ఇన్నాళ్లకు తాను అనుకున్నది నిజమయిందని ఈ సందర్భంగా యువీ పేర్కొన్నాడు.