క్రికెట్ ఆడుతున్న రోజుల్లో మైదానంలో తన ఫెర్మార్మెన్స్ తోనూ - బయట గర్ల్ ఫ్రెండ్స్ హడావిడితోనూ బిజీగా గడిపిన ఇండియన్ క్రికెట్ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ .. తర్వాతి కాలంలో కాస్త రెస్ట్ దొరకడంతో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు. ఒక రేడియో చానల్ లో ప్రత్యేక షోలో పాల్గొన్న యూవీ.. విరాట్ కోహ్లీ పిసినారితనం గురించి, నెహ్రా పొదుపు గురించి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సౌరవ్ గంగూలీ - మహేంద్ర సింగ్ ధోనీలపై కూడా యువీ కామెంట్స్ చేసాడు.
ఈ రేడియో షో లో తనపై సందించిన ఒక ప్రశ్న.. సౌరబ్ గంగూలీ - మహేంద్ర సింగ్ ధోనీలలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని మీరు భావిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు వేస్తే.. నాకు ఇద్దరూ ఇష్టమే - ఇద్దరూ బెస్ట్ కెప్టెన్సే - ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ అంటూ నాంచుడు స్పందనలు - కప్పదాటు సమాధానాలు చెప్పని యువీ... "గంగూలీ సారథ్యంలోనే నేను కెరీర్ ప్రారంభించాను.. గంగూలీ జట్టును ఒక్కతాటిపై నిలపడంలో సక్సెస్ అయ్యాడు.. నేనే కాదు నాతోపాటు సెహ్వాగ్ - జహీర్ - నెహ్రా - హర్భజన్ వంటి ఆటగాళ్లను దాదా ఎంతగానో ప్రోత్సహించాడు.. ఫైనల్ గా దాదానే బెస్ట్ కెప్టెన్" అని చెప్పి ముగించాడు.
కాగా.. ధోనీతో యువరాజ్ కు విబేధాలున్నట్టు ఆ మధ్య కొన్ని గాసిప్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గాసిప్స్ కి బలం చేకూరుస్తూ... "2011 వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ కి తర్వాత కాలంలో అవకాశాలు రాకపోవడానికి ధోనీయే కారణమని" యూవీ తండ్రి యోగరాజ్ చెప్పారు. ఈ విషయాలను యువీ తర్వాత ఖండించారు! ఏది ఏమైనా.. ధోనీ కంటే దాదా నే బెస్ట్ కెప్టెన్ అని యూవీ కుండ బద్దలు కొట్టి చెప్పడం ధోనీకి షాక్ అనే అనుకోవాలేమో!!