విశాఖ జిల్లా వైసీపీ రాజకీయాలు ఇపుడు పూర్తి రివర్స్ లో నడుస్తున్నాయి. దాదాపు ఆరేళ్ళ పాటు ఒంటి చేత్తో విజయసాయిరెడ్డి ఈ జిల్లా రాజకీయాలను శాసించారు. ఒక విధంగా సామంతరాజుగా ఆయన వెలిగారు. తాను ఏమనుకుంటే అదే చేసేవారు. ఆయనకు జగన్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి ఉనిద్. అలా విశాఖ సాయిరెడ్డిగా కూడా ఒక దశలో ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే ఆరు నెలల క్రితం ఆయనను తప్పించి జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఈ జిల్లా బాధ్యతలు అప్పగించారు. దాంతో నాటి నుంచే వైసీపీ పాలిటిక్స్ కూడా కొత్త మలుపు తీసుకుంది అని అంటున్నారు.
నాడు విజయసాయిరెడ్డి దూరం పెట్టిన వారు అంతా ఇపుడు వైవీకి సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే నాడు విజయసాయిరెడ్డితో కలిసి తిరిగిన వారు ఇపుడు సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు. మొత్తానికి వైవీ తనదైన పాలిటిక్స్ తో రెండవ వర్గాన్ని అక్కున చేర్చుకున్నారు అని అంటున్నారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీ నుంచి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ కి 2024 ఎన్నికల్లో టికెట్ కన్ ఫర్మ్ అయ్యేలా జగన్ వద్ద వైవీ రాయబారం చేశారని అంటున్నారు.
ఆయనకు టికెట్ ఇవ్వకుండా వేరే వారిని విజయసాయిరెడ్డి ప్రతిపాదించి ఉంచారు. అయితే ఆ టికెట్ ఆశించిన సీతం రాజు సుధాకర్ ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించడానికి వైవీ ఒప్పించారు. ఇక విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా గతంలో పార్టీకి దూరంగా అంటీ ముట్టనట్లుగా ఉండేవారు. ఇపుడు వైవీ విశాఖ వస్తే చాలు ఆయన పక్కన ఉంటున్నారు. ఆయనకు విశాఖ తూర్పు నుంచి టికెట్ కన్ ఫర్మ్ అయిందని ప్రచారం సాగుతోంది. ఇక విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అక్రమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీలకు మాత్రం విజయసాయిరెడ్డి వర్గీయులుగా ముద్ర ఉందని వారికి చెక్ పెట్టేశారు అని అంటున్నారు.
అదే విధంగా విజయసాయిరెడ్డి మనిషిగా పేరున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ ని తప్పించి కొత్తగా విశాఖ డైరీ సంస్థ కో చైర్మన్ అయిన ఆడారి ఆనంద్ కి అక్కడ ఇంచార్జి బాధ్యతలను వైవీ కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఖరారు చేశారు. అదే విధంగా చూస్తే భీమిలీ సీటులో కూడా అవంతి శ్రీనివాసరావుని తప్పించే ప్రయత్నం జరుగుతోంది.
మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాకను విజయసాయిరెడ్డి వ్యతిరేకిస్తే వైవీ సుబ్బారెడ్డి స్వాగతిస్తున్నారు. అంతే కాదు పార్టీ కోసం ఉపయోగపడతారు అనుకుంటే ఎవరిని అయినా చేర్చుకుంటాం, ఇది నిరంతర ప్రక్రియ అని వైవీ అంటున్నారు. విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి అవంతిని తప్పించి పంచకర్ల రమేష్ బాబుని నియమించడంతో వైవీ పాత్ర ఉందని అంటున్నారు. ఈ విధంగా చూస్తే టోటల్ గా విశాఖ వైసీపీని ఆయన తనదైన శైలిలో అటు నుంచి ఇటు నరుక్కు వచ్చారని అంటున్నారు. గాజువాక, పెందుర్తి సీట్ల విషయంలో కూడా వైవీ కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డికి నాడు అనుకూలంగా ఉన్న వారిలో ఉత్తర నియోజకవర్గం నుంచి ఒక్క కేకే రాజు తప్ప మిగిలిన వారందరినీ సైడ్ చేశారనే అంటున్నారు. మరి ఇది పార్టీ మేలు కోసమెనా అలా అయితే ఫరవాలేదని, లేకపోతే మాత్రం ఎన్నికల వేళ వర్గ పోరు మరింతగా ముదిరిపోయి పార్టీ ఏ తీరానికి చేరుతుందో తెలియదు అని అంటున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి వర్గీయులుగా గట్టి ముద్ర వేసుకున్న వారు మాత్రం ఇపుడు హల్ చల్ చేయడంలేదు అనే మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.