ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. బీజేపీతో కుమ్మక్కు రాజకీయాల్ని ఓవైపు చేస్తూ. మరోవైపు తమను బద్నాం చేస్తున్నట్లుగా వారు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తాము చేసిన రాజీనామాల గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదన్న వారు.. బాబు..ఏపీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ బాబు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనేమన్నారంటే..
+ రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంటుందని - స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు మా ఎంపీల రాజీనామాలపై మాట్లాడం సరికాదు.
+ చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలు. ఏపీకి ప్రత్యేకహోదాపై చిత్తశుద్దితో పోరాటాలు చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రమే.
+ మా పార్టీ అవిశ్వాసం కోసం తీర్మానం పెడితే చర్చ పెట్టలేదని, టీడీపీ ఇస్తే మాత్రం చర్చకు తీసుకు వచ్చారు. ఎప్పటికీ చంద్రబాబు మా మిత్రుడే అని కేంద్రమంత్రిరాజ్ నాథ్ సింగ్ పార్లమెంటు వద్ద వ్యాఖ్యానించటం మర్చిపోకూడదు. వారి మధ్య కుమ్మకు రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఇవే నిదర్శనాలు.
+ 23 మంది ఫిరాయింపు దార్లపై చర్యలు తీసుకుంటే ఎన్నికలు వచ్చేవి కాదా? . బుట్టా రేణుకపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. ఆమెపై చర్య తీసుకున్నా ఎన్నికలు వచ్చేవిగా. మేం ఎన్నికలు రాకుండా మా ఎంపీలు రాజీనామాలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
+ పగలు కాంగ్రెస్‌తో రాత్రిళ్లు బిజేపీతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించారు. ఎన్నికల కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం మా పార్టీ ఎంపీలు 14 నెలల ముందు రాజీనామా చేశాం.
+ ఏప్రిల్ 6, 2018న ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రాజీనామాలు చేశాం.టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉండి హోదా విభజన హామీల విషయంలో మోసం చేశారు. ఇది ప్రజలకు చెప్పెందుకే రాజీనామాలు చేశాం. హోదా కోసం గుంటూరులో 8 రోజులు వైఎస్ జగన్ ఆమరణదీక్ష చేస్తే.. భగ్నం చేయించింది చంద్రబాబు కాదా?
+ మా ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరమదీక్ష చేశారు.,ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వంగవీటి రాధా మా పార్టీలోనే ఉన్నారు.టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు. మేం బీజేపీతో కలిసి ఉంటే.. మా పార్టీ అధినేతపైనా.. వైఎస్ భారతి పైనా ఎందుకు కేసులు పెడతారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.